ఎవరు పడితే వాడొచ్చి నరకడానికి నేనేం గొర్రెను కాను..!

-

కన్నడ స్టార్ హీరో యశ్ చంపేందుకు స్కెచ్ రెడీ అయ్యిందని.. అతన్ని చంపబోతున్నారని కన్నడ మీడియా చేసిన హడావిడి తెలిసిందే. వరుస హిట్లతో సూపర్ ఫాంలో ఉన్న యశ్ ఈమధ్య వచ్చిన కె.జి.ఎఫ్ సినిమాతో సౌత్ అందరికి సుపరిచితుడు అయ్యాడు. ఆ సినిమాలో అతని నటనకు తెలుగు, తమిళ, హింది ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. అయితే సక్సెస్ జోష్ లో ఉన్న ఇతనికి లైఫ్ త్రెట్ వార్తలు డిస్ట్రబ్ చేస్తున్నాయి.

వీటిపై యశ్ క్లారిటీ ఇస్తూ తనని చంపాలనుకున్న వార్తలను ఖండించాడు. అంతేకాదు నగర ఏసిపిని తాను కలిశానని దీని గురించి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. ఇలాంటి వార్తల వల్ల అభిమానులు, కుటుంబ సభ్యులు కంగారు పడుతున్నారని అన్నారు. గ్యాంగ్ స్టర్ ఎవరు అరెస్టయినా తన లైఫ్ కు రిస్క్ ఉందని అనేస్తున్నారు. ఎవరు పడితే వాడొచ్చి నరకడానికి నేనేం గొర్రెను కాదని తన సామర్ధ్యం ఏంటో తెలుసని అన్నారు యశ్. మీడియాలో వచ్చిన వార్తలకు నిజంగానే యశ్ ఫ్యాన్స్ భయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version