వివేకా కేసు..సీబీఐని మేనేజ్ చేస్తున్న బాబు..అంత సీన్ ఉందా?

-

వైఎస్ వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పలువురు నిందితులతో పాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిలని సి‌బి‌ఐ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వైఎస్ వివేకాని చంపించింది అవినాష్ రెడ్డి అని సి‌బి‌ఐ విచారణలో తేలిందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం తెలియదు గాని..రెండోసారి అవినాష్ రెడ్డిని సి‌బి‌ఐ విచారణ చేస్తుంది.

ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా కేసును జగన్ మీదకు తీసుకు వచ్చేందుకు చూస్తున్నారని, అసలైన వారిని విచారణ చేయకుండా అవినాష్, భాస్కర్ రెడ్డిల చుట్టూ తిప్పుతున్నారని, కేసును జగన్ వైపు తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ కుట్ర వెనుక చంద్రబాబు మాస్టర్ మైండ్ ఉందని, ఆయన కాల్ లిస్టుని బయటకు తీయాలని డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ జరుగుతున్న తీరుపై అనేక ప్రశ్నలు ఉన్నాయని.. వివేకా హత్య జరిగాక అనేక కథనాలు బయటకి వచ్చాయని తెలిపారు.

బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డిలని సి‌బి‌ఐ ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. అయితే గత ఎన్నికల ముందు టి‌డి‌పి హయాంలో వివేకా హత్య జరిగిన విషయం తెలిసిందే..మొదట గుండెపోటు అని, ఆ తర్వాత హత్య అని నిర్ధారించారు. వివేకాని హత్య చేయించింది చంద్రబాబు, టి‌డి‌పి నేతలే అని జగన్ తో సహ వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు.

ఆ అంశం ఎన్నికల్లో బాగా ప్రభావితం చూపించి టి‌డి‌పికి నెగిటివ్, వైసీపీకి పాజిటివ్ అయింది. ఇక ఎన్నికల ముందు వివేకా హత్య కేసులో సి‌బి‌ఐ విచారణ కావాలని కోరిన జగన్…అధికారంలోకి వచ్చాక దాన్ని వెనక్కి తీసుకున్నారు. కానీ ఈ విషయంలో వివేకా కుమార్తె సునీత సి‌బి‌ఐ విచారణకు డిమాండ్ చేయడం..కోర్టు విచారణకు ఆదేశించడం..కొందరు నిందితులని కస్టడీలోకి తీసుకోవడం..మరికొందరిని సి‌బి‌ఐ విచారణ చేయడం చేస్తుంది.

అలాగే సి‌బి‌ఐ విచారణని కడపలో కాకుండా హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఎంపీ అవినాష్ రెడ్డిని సి‌బి‌ఐ రెండోసారి విచారణ చేస్తుంది. ఇక దీనిపై టి‌డి‌పి నేతలు పెద్ద ఎత్తున వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు సైతం..బాబాయిని చంపించింది అబ్బాయే అని తేలిపోయిందని ఫైర్ అయ్యారు.

ఎన్నికల ముందు ఏమో తానే చంపించానని డ్రామాలు ఆడారు అని, ఇప్పుడు అసలు నిజాలు బయటకొచ్చాయని అంటున్నారు. ఇదే క్రమంలో సి‌బి‌ఐని బాబు మేనేజ్ చేస్తూ..కేసుని జగన్ వైపుకు తిప్పుతున్నారని సజ్జల ఆరోపిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బి‌జే‌పి చేతుల్లో ఉన్న సి‌బి‌ఐని బాబు మేనేజ్ చేయగలిగితే జగన్ పరిస్తితి ఎలా ఉండేదో చెప్పక్కర్లేదు అని టి‌డి‌పి కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అడ్డంగా  దొరికిపోవడంతోనే ఇప్పుడు సి‌బి‌ఐని బాబు మేనేజ్ చేస్తున్నారని సజ్జల కవర్ చేస్తున్నారని టి‌డి‌పి శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version