కాంగ్రెస్ అంచనాలు తలకిందులు.. సంచలన నిర్ణయం తీసుకున్న సమాజ్ వాదీ పార్టీ..

-

బిజేపీని అడ్డుకునేందుకు ఇండియా కూటమికి సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మంచిరోజులు వచ్చేలా లేవ్.. హర్యానా, జమ్ము కశ్మీర్ లో గెలుస్తామని భావించిన ఆ పార్టీ.. ఆశించిన స్తాయిలో పలితాలు రాబట్టలేదు.. హర్యానాలో ఓడిపోయి.. జమ్ములో పొత్తుతో అధికారంలోకి వచ్చినా.. కేవలం ఆరు సీట్లు మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది.. ఈ క్రమంలో ఇండియా కూటమిలో ఉండే పార్టీలే.. కాంగ్రెస్ పార్టీ మీద సెటైర్లు వేస్లున్నాయి..

ఎన్నికలకు ముందు హీరో బిల్డప్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఫలితాల తర్వాత జీరోగా మారిందని టాక్ ఇండియా కూటమి నుంచే వినిపిస్తున్నాయి.. ఈ రెండు రాష్టాల ఫలితాలు ప్రకటన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్తితి పూర్తిగా ఇబ్బందికరంగా మారిందనే ప్రచారం జరుగుతోంది.. హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తగిలింది.. బిజేపీ మీద ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.. హర్యానాలో ఎన్నికల ప్రచారాన్ని ఆ పార్టీ నేతలు రెట్టింపు ఉత్సాహంతో నిర్వహించారు.. ఏడు గ్యారేంటీలతో జనాల్లోకి వెళ్లారు.. కానీ బోల్తా పడ్డారు.. ఆ రాష్టంలో ఓటమి కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడటం లేదట..

గెలుస్తామని భావించిన హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోవడం.. బిజేపీ హ్యట్రీక్ విజయాన్ని అందుకుని అధికారంలోకి రావడంతో ఏఐసీసీ పెద్దలు దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.. మరో పక్క జమ్మూలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.. కేవలం ఆరుస్థానాలకే పరిమితమైంది.. ఎన్సీతో పొత్తు ఉండటంతో అధికారంలోకి రాగలిగింది.. ఈ రెండు ఘటనలు కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చాయి..

కాంగ్రెస్ పరిస్తితిని గమనించిన ఇండియా కూటమిలో ఉండే పార్టీలు తలోదారి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.. ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ.. తీసుకున్న తాజా నిర్ణయం కొన్ని సందేహాలకు దారి తీస్తోంది.. యూపిలో పది చోట్ల త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ క్రమంలో కాంగ్రెస్ ను సంప్రదించకుండానే.. సమాజ్ వాదీ పార్టీ తమ అభ్యర్దులను ప్రకటించింది.. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. సమాజ్ వాదీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఎటు దారి తీస్తుందో అన్న చర్చ ఇండియా కూటమిలో జరుగుతోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version