తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పల్లికి మధ్యాహ్నం చేరుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి దసరా వేడుకలకు హాజరయ్యారు. వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం, గ్రంథాలయంతో పాటు పశువైద్య శాల, బీసీ కమ్యూనిటి హాల్ ని ప్రారంభించారు. అనంతరం కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామానికి వస్తుండటంతో అధికారులు రెండు రోజుల ముందటే ఏర్పాట్లు చేశారు.
రేవంత్ రెడ్డి సీఎం హోదాలో కొండారెడ్డి పల్లికి చేరుకోవడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలంతా కొండారెడ్డి పల్లికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కొండారెడ్డి పల్లిలో ఇప్పటివరకు ఇంత జనం గుమికూడటం ఇదే మొదటిసారి అని చర్చించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పైలెట్ ప్రాజెక్ట్ కింద కొండారెడ్డి పల్లిలో ప్రతీ ఇంటికి సోలార్ విద్యుత్ అందజేస్తున్న విషయం తెలిసిందే. చిల్ట్రన్ పార్కు, వ్యాయామ శాల నిర్మాణానికి శంకుస్థాపన, ప్రతీ ఇంటికి సోలార్ ప్యానల్ ని అమర్చనున్నారు అధికారులు.