కాంగ్రెస్ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘ అన్ని రాష్ట్రల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లు కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ బిడ్డలను నాన్ లోకల్‌గా మార్చే కుట్ర జరుగుతోందని ప్రశ్నించారు. స్థానికతపై ప్రభుత్వం ఎందుకు వివాదాస్పదం చేస్తోంది? బీఆర్ఎస్ రాష్ట్రాన్ని డాక్టర్ల పరిశ్రమగా మారిస్తే కాంగ్రెస్ దానికి తూట్ల పొడుస్తోంది’ అని కేటీఆర్ ట్విట్టర్ ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు.
ఇదిలాఉండగా, అమెరికా నుంచి హైదరాబాద్‌లో అడుగుపెట్టిన కేటీఆర్ ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించినట్లు తెలుస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని ఆయన పేర్కొన్నారు. కాగా, కేటీఆర్ రాకతో రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయం ఎన్ని కీలక మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే.