సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. టీఆర్‌ఎస్ తరఫు నుంచి ఇప్పటికే 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీలు తమ తమ పార్టీల తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాయి. ఇక టీఆర్‌ఎస్‌లోనే ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడ్డ వారు పార్టీ మారేందుకు లేదా ఇండిపెండెంట్లుగా పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు. అందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్‌కు రెబల్స్ భయం పట్టుకుంది.
గ్రేటర్‌లో ఐటీ నియోజకవర్గంగా పేరుగాంచిన శేరిలింగంపల్లిలో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీకి టిక్కెట్ ఇచ్చారు. అయితే మొదట్నుంచీ టిక్కెట్ రేసులో నిలిచి భంగపడ్డ మొవ్వా సత్యానారాయణ మళ్లీ సొంత పార్టీ టీడీపీ గూటికే చేరారు. ఇక టీఆర్‌ఎస్‌కే చెందిన కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్‌లు కూడా ఎమ్మెల్యే టిక్కెట్ కోసం గట్టిగానే యత్నించారు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వారు రెబల్స్‌గా మారుతారా లేదా అన్నది సస్పెన్స్‌లో పడింది. ఇక కాంగ్రెస్ నుంచి ఈసారి మాజీ ఎమ్మెల్యే భిక్షపతియాదవ్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ నియోజకవర్గంలో ఈ సారి ఆసక్తికర పోటీ నెలకొంటుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. అయితే పైన చెప్పిన అభ్యర్థుల్లో ఎవరు ఎమ్మెల్యేగా గెలిస్తే బాగుంటుందో మీరు కింద ఓటింగ్‌లో తెలియజేయవచ్చు. ఈ ఓటింగ్‌లో పాల్గొని మీకు నచ్చిన నేతను ఎంచుకుని ఓట్ చేయండి. మీకిష్టమైన నాయకుడిపై మీ కామెంట్లను కూడా కింద తెలియజేయవచ్చు. ఓటింగ్ ముగిశాక ఫలితాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది..!
[Total_Soft_Poll id=”10″]