మూడో ప్రపంచ యుద్దం తప్పదా..? అగ్ర దేశాల భీకర దాడులు వ్యవహారం దేనికి సంకేతం..?

-

ప్రతి యుద్దం వెనుక ఒక మార్పు ఉంటుంది.. అలా ఎన్నో యుద్దాలు ప్రపంచ గతిని మార్చేశాయి.. ప్రపంచ పేజీలను తిరగేస్తే.. యుద్దం జరిగిన ప్రతిసారీ ప్రపంచం వెనక్కి వెళ్లిపోయింది.. ఈ యుద్దం మిగిల్చిన విషాదాన్ని తలుచుకోవడానికి భయమేసే పరిస్తితులు వస్తాయి.. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్ వ్యవహారాన్ని పరిశీలిస్తే..మరో యుద్దం తప్పదా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి..

త్వరలో మరో ప్రపంచ యుద్దం రాబోతుందా..? రెండు దేశాలు తమ ఆదిపత్యం కోసం కయ్యానికి కాలు దువ్వుతున్నాయా… ప్రపంచం డేంజర్ జోన్లోకి అడుగుపెడుతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, రగులుతున్న మిడిల్ ఈస్ట్.. ప్రపంచానికి యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు యుద్ద మేఘాలు అలుముకున్నాయి..

ఓవైపు రష్యా, యుక్రెయిన్ బాంబుల మోత మోగించుకుంటూ ఏళ్లు గడిపేస్తున్నాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లోనూ అదే పరిస్థితి. ఏడాది క్రితం మొదలైన యుద్ధం మూడు సంస్థలు, 6 దేశాలను చుట్టుకుంది. రక్తపాతం సృష్టిస్తోంది. ఇజ్రాయెల్ తో పాలస్తీనా, లెబనాన్, సిరియా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధంతో ఎప్పుడు ఎవరు ఎవరి మీద దాడి చేస్తారో అర్థం కాని పరిస్థితి. దీంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.. ఈ భీకర దాడుల్లో అగ్రరాజ్యం అమెరికా ఎప్పుడు జోక్యం చేసుకుంటుందో… అది మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తుందేమోనన్న ఆందోళన ఆందరిలోనూ కల్గుతోంది..

ఇరాన్ మీద ఇజ్రాయెల్ యుద్ధానికి దిగితే ఈ దాడులు అరబ్ దేశాలు, అమెరికాకు విస్తరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ కోసం అమెరికా రంగంలోకి దిగింది. అన్ని విషయాల్లోనూ తాము అండగా ఉంటామని అగ్రరాజ్యం ఇప్పటికే ప్రకటించింది.. తమ మిత్రదేశం మీదకు యుద్దానికి వస్తే చూస్తూ ఊరుకోమని.. అమెరికా డైరెక్ట్ గా వార్నింగ్ఇచ్చిన నేపథ్యంలో భవిష్యత్ లో మరో భయానకమైన యుద్దం తప్పేలా లేదు..

Read more RELATED
Recommended to you

Exit mobile version