నేడు తెలంగాణకు సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా.. కారణం అదేనా?

-

సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా నేడు (శుక్రవారం) తెలంగాణకు రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో రాజకీయాలు కీలక మలుపు తిరుగుతాయని తెలుస్తోంది. ఇంతకాలం కేవలం ఢిల్లీకే పరిమితమైన వాద్రా ఇప్పుడు రాష్ట్రానికి రావడానికి గల కారణాలపై ప్రస్తుత రాజకీయాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది.

ఆయన ఏదైనా వ్యాపారం పని మీద రాష్ట్రానికి విచ్చేస్తున్నారా? లేదా ఏదైనా రాజకీయ ఉద్దేశంతో అడుగుపెట్టనున్నారా? అనేది ఇంకా తెలియరాలేదు. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో వాద్రా గాంధీల కంచుకోట అయిన అమేథీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావించారు. కానీ, చివరకు రాహుల్ గాంధీనే అక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే.

యూపీఏ హయాంలో రాబర్ట్ వాద్రా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఆయన మీద అభియోగాలు మోపబడ్డాయి. DLF ల్యాండ్ స్కాం, బికనీర్ ల్యాండ్ స్కాం, రూ.9600 కోట్ల కర్ణాటక లోయకుంట ఇలా ఎన్నో స్కాంలలో హస్తం ఉన్న రాబర్ట్ వాద్రా తెలంగాణ పర్యటన వెనకున్న రహస్యం ఏమిటని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.తెలంగాణ నుంచి రానున్న రోజుల్లో ఆయన రాజ్యసభకు వెళ్లాళని భావిస్తున్నారా? లేక ఏదైనా పర్సనల్ పనిమీద వస్తున్నారా? అనేది ఇంకా ఎవరికి తెలియరాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news