ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి తీవ్ర జ్వరం.. హైదరాబాద్‌కు తరలింపు!

-

రాష్ట్ర వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఓవైపు ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో దోమల వ్యాప్తికి తోడు డెంగ్యూ జ్వరాలు కూడా ప్రబలు తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. రోగుల తాకిడిని తట్టుకోలేక వైద్యులు కూడా ఇబ్బందులు పడుతున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం సామాన్య ప్రజలే కాకుండా ప్రజా ప్రతినిధులు కూడా జ్వరాల బారిన పడుతున్నారు. ప్రజాసేవలో నిమగ్నం కావాల్సిన వారు తీవ్రజ్వరాల పాలై మంచం పడుతున్నారు.

తాజాగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి తీవ్రజ్వరం బారిన పడ్డారు. ఈ క్రమంలోనే వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే విషజ్వరం బారిన పడినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. స్థానికంగా సౌకర్యాలు సరిగా లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా, రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news