ఎట్టకేలకి తెలంగాణా గవర్నర్ నరసింహన్ మార్పు జరిగింది. విభజన సమయంలో తెలుగు రాష్ట్రాలకి గవర్నర్ గా వ్యవహరించిన ఆయన బదిలీ అయ్యారు. తెలంగాణాకి కొత్త గవర్నర్ గా చెన్నై కి చెందిన సౌందర్ రాజన్ నియమింపబడ్డారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రపతి రామ్ నాద్ కోవిండ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
నూతన గవర్నర్ గా నియమితులు అయిన సౌందర్ రాజన్ తమిళ నాడు బీజేపీ చీఫ్ గా కీలకంగా వ్యవహరిస్తున్నారు.తమిళ నాడులో బీజేపే బలోపేతానికి ఎనలేని కృషి చేస్తిన ఆమెని తెలంగాణా గవర్నర్ గా నియమించడం పట్ల రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ గవర్నర్ గా వ్యవహరించిన నరసింహన్ ని ప్రస్తుతం ఎక్కడికి మార్చారనేది ఇంకా తెలియరాలేదు.
ఇదిలాఉంటే తెలంగాణలో బీజేపీకి ఆది నుంచీ కీలకంగా ఉంటూ ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయకి హిమాచల్ప్రదేశ్ గవర్నర్ గా కీలక భాద్యతలు అప్పగించింది కేంద్రం. గత మంత్రి వర్గ విస్తరణలో కిషన్ రెడ్డి కి కేంద్ర సహాయమంత్రి గా అవకాశం ఇచ్చిన కేంద్రం, ఈ సారి దత్తాత్రేయ కి గవర్నర్ గా భాద్యతలు అప్పగించింది. ఏది ఏమైనా ఒక పక్క కిషన్ రెడ్డికి కేంద్ర సహాయ హోంమంత్రి గా భాద్యతలు అప్పగించి, అదే తెలంగాణలో మరో బీజేపీ కీలక నేతకి గవర్నర్ అవకాశం కల్పిస్తూ తెలంగాణాలో పట్టు సాధించడానికి వ్యూహాత్మక అడుగులు బీజేపీ వేస్తోందని అంటున్నారు విశ్లేషకులు.