చంద్రబాబు వృద్ధ జంబూకం… ట్వీట్ల‌తో రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ

-

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తండ్రి కొడుకుల‌పై ట్వీట్ల‌తో విరుచుకుప‌డ్డాడు. ఏపీలో ఇప్పుడంతా ట్వీట్ల‌తోనే రాజ‌కీయ యుద్ధం సాగుతున్న త‌రుణంలో విజ‌య‌సాయిరెడ్డి తండ్రి నారా చంద్ర‌బాబు నాయుడు, కొడుకు నారా లోకేష్‌ల‌పై వ‌రుస ట్వీట్ల‌లో ఎదురుదాడి చేశాడు. విజ‌య‌సాయిరెడ్డి టీడీపీ నేతలపై ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి మండిపడ్డారు. రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే ఆద్యుడంటూ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు వేల మంది వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారంటూ గుర్తు చేశారు. ట్విట్టర్ ద్వారా టీడీపీ నేతలపై చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఒక‌ట్వీట్‌లో నారా చంద్ర‌బాబు నాయుడు వృద్ధ జంబూకం శాంతి వ‌చ‌నాలు ప‌లుకుతున్నాడ‌ని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇలా ఉంది… రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి ఆద్యుడు నారా చంద్ర‌బాబు నాయుడు గారే. ఆయన ఐదేళ్ల రాక్షస పాలనలో వందల మంది వైసీపీ నేతలు జైళ్ల పాలయ్యారు. వేల మందిని గ్రామాల నుంచి తరిమేశారు. 600 మందిని హత్య చేశారు. వృద్ధ జంబూకం శాంతి వచనాలు పలికినట్టు ఇప్పుడు వేధింపుల గురించి మాట్లాడుతున్నారు.

మరో ట్వీట్‌లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్‌ను కూడా ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. తండ్రీ కొడుకులిద్దరూ.. ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలన్నింటినీ గొలుసులు విప్పి వదిలేశారంటూ ట్వీట్ చేశారు. అవి దారిన పోయే వాళ్ళందరి వెంట పడుతున్నాయని.. ఈయన ఉస్కో అంటే మొరగటమొక్కటే వాటికి తెలుసని.. మొరిగే కుక్కలను తరిమికొట్టిన తర్వాత తమకు బడితె పూజేనని మర్చి పోయినట్టున్నారంటూ పేర్కొన్నారు.

ఇంకో ట్వీట్‌లో టీడీపీ నేత చిప్ ఖ‌రాబైందంటూ రిపేర్ చేయించుకో అని స‌ల‌హా ఇస్తూ ట్వీట్ చేశాడు.
చిత్తు చిత్తుగా ఓడిపోయి 3 నెలలు కాలేదు. మిమ్మల్ని ఓడించిన ప్రజలు రాక్షసులా ?  ఏకపక్ష తీర్పుతో వారు విజయ తిలకం దిద్దిన వ్యక్తి భస్మారుడా ? స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా ? ఈ వయసులోనే మెదడులో చిప్ పాడైనట్లుంది. కాస్త రిపేర్ చేయించండి. కాబోయే పార్టీ అధ్యక్షుడు కదా?  అంటూ ట్వీట్ చేసిన విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్లో నారా లోకేష్‌ని ఉద్దేశిస్తూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఇసుక మాఫియా, రాజధాని ప్రాంతంలో వరద గురించి కూడా ప్రస్తావించారు.

ఇలా ట్వీట్ల యుద్ధం సాగించిన విజ‌య‌సాయిరెడ్డి ఇసుక‌పై కూడా తండ్రి కొడుకుల‌ను వ‌ద‌ల లేదు.. ఇసుక పిడీని అడ్డుకుంటే 24 గంటలు కరెంటు సరఫరా నిలిచి పోయినంతగా గంగ వెర్రులెత్తుతున్నారు. ఇసుకుపై కొత్త పాలసీ వచ్చిన తర్వాత ఇంకెంత రెచ్చి పోతారో? ఈ ధర్నాల ఉద్దేశం చూస్తుంటే, ఎప్పటిలాగే మావాళ్లను ఇసుక బొక్కనివ్వండి సీఎం గారూ అని వేడుకుంటున్నట్టుగా ఉంది.

రాజధాని ప్రాంతాన్ని వరద ముంచెత్తినప్పటి నుంచి చంద్ర‌బాబు నాయుడు గారు దెయ్యం పట్టిన వాడిలా మారిపోయారు. భూములపై వందల కోట్లు పెట్టుబడి పెట్టిన తన బినామీలు, బంధువర్గం పరిస్థితి ఏమవుతుందనే బెంగ పట్టుకుంది.ప్రతిపక్ష నేత అయి ఉండీ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా తాటాకు చప్పుళ్లు చేయిస్తున్నారు. అంటూ విజ‌య‌సాయిరెడ్డి టీడీపీ నేత‌ల‌పై ట్వీట్ల యుద్దం సాగించారు. ఇప్పుడు ఈ ట్వీట్ల యుద్దం ఏపీలో రాజ‌కీయ దుమారాన్నే రేపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version