కారులో కుమ్ములాట…ఆ ఎమ్మెల్యేలకు చుక్కలే!

-

ఓ వైపు బీజేపీ…మరోవైపు కాంగ్రెస్ …ఈ రెండు పార్టీలు రోజురోజుకూ బలపడుతూ.. అధికార టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నాయి..ముఖ్యంగా బీజేపీతో…కారు పార్టీకి బాగా రిస్క్ ఎక్కువగా ఉంది. ఇలాంటి తరుణంలో ప్రత్యర్ధి పార్టీలకు చెక్ పెట్టేలా కారు నేతలు పనిచేయాలి…కానీ కారు నేతలు ప్రత్యర్ధి పార్టీలపై ఫైట్ చేయడం కంటే…సొంత పార్టీలో ఉండే నేతలపైనే ఫైట్ చేస్తున్నారు. చాలా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్లో అంతర్గత పోరు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే సీట్ల విషయంలో పెద్ద పంచాయితీనే నడుస్తోంది.

అలాగే సొంత ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మిగిలిన టీఆర్ఎస్ నేతలు పనిచేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల వైఖరి సొంత పార్టీ వాళ్ళకే నచ్చడం లేదు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఉమ్మడి నల్గొండలో పలువురు ఎమ్మెల్యేలపై సొంత పార్టీ వాళ్ళు ఫైర్ అయ్యే పరిస్తితి. ఇప్పటికే కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పై …అక్కడ ఉండే పార్టీ శ్రేణులు రివర్స్ అవుతున్న విషయం తెలిసిందే.

సొంత పార్టీ వాళ్ళని వదిలేసి…వేరే పార్టీలకు చెందిన వారికి ఎమ్మెల్యే ప్రాధాన్యత ఇస్తున్నారని, గులాబీ దళం రగిలిపోతుంది…నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ మల్లయ్యకు గాని సీటు ఇస్తే…తామే ఓడిస్తామనే విధంగా కారు నేతలు ఉన్నారు. ఇక కోదాడలోనే కాదు…నల్గొండ అసెంబ్లీలో కూడా అదే రచ్చ జరుగుతుంది. ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే అయిన కంచర్ల భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా…నల్గొండ టీఆర్ఎస్ కౌన్సిలర్లు గళం విప్పుతున్నారు…అభివృద్ధి పనుల విషయంలో కౌన్సిలర్లు, ఎమ్మెల్యే మధ్య గ్యాప్ వచ్చింది. అందుకే తాజాగా కౌన్సిల్ సమావేశాన్ని సైతం కౌన్సిలర్లు బహిష్కరించారు.

ఎమ్మెల్యే ఎక్కువగా ప్రత్యర్ధి పార్టీకి చెందిన కౌన్సిలర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని సొంత పార్టీ వాళ్ళు ఫైర్ అవుతున్నారు. ఇక ఇది ఇలాగే కంటిన్యూ అయితే…కంచర్లకు కూడా నెక్స్ట్ ఎన్నికల్లో ఇబ్బందులు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version