నేడు అమిత్ షా తో రాష్ట్ర బీజేపీ నేతల భేటీ

తెలంగాణ రాష్ట్ర బీజేపీ ముఖ్య నేత‌ల‌తో నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స‌మావేశం కానున్నారు. ఈ స‌మావేశానికి తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తో పాటు ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్, డీ కే అరుణ తో పాటు ప‌లువురు ముఖ్య నేత‌లు ఈ స‌మావేశంలో పాల్గొనున్నారు. కాగ ఈ స‌మావేశంలో ముఖ్యంగా తెలంగాణ లో వ‌రి ధాన్యం కొనుగోళ్లు పై టీఆర్ఎస్ చేస్తున్న ఆందోళ‌న పై రాష్ట్ర నాయ‌కుల‌తో అమిత్ షా చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

అలాగే తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కొని బీజేపీని ఎలా విస్త‌రించాల్సిన విష‌యం పై కూడా చ‌ర్చిస్తార‌ని తెలుస్తుంది. దీంతో పాటు వ‌రి కొనుగోళ్ల విష‌యం లో టీఆర్ఎస్ చేస్తున్న ఆందోళ‌నల‌ను ఎలాంటి వ్య‌హాల‌తో తిప్పికొట్ట‌వ‌చ్చ‌ని రాష్ట్ర నాయ‌కుల‌కు దిశ నిర్ధేశం చేయ‌నున్నారు. కాగ వ‌రి ధాన్యం కొనుగోళ్ల విష‌యంపై చ‌ర్చించ‌డానికి తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందం ఇప్ప‌టికే ఢిల్లీ చేరుకుంది. అలాగే ఈ రోజు కేంద్ర మంత్రి పీయూష్ గోయ‌ల్ తో స‌మావేశం కానున్నారు.