సరికొత్త ప్లాన్ తో ముందుకు వెళుతున్న టీడీపీ – బీజేపీ..??

-

2014 సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం మరియు బిజెపి కలసి పోటీ చేసి అధికారంలోకి రావడం జరిగింది. కాగా 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు విడిపోయి ఎవరికి వారు పోటీచేయగా ఇద్దరికీ పెద్ద లాభాలేమి జరగలేదు. తెలుగుదేశం పార్టీ చాలా దారుణంగా ప్రతిపక్షంలో కి వెళ్ళిపోయింది. ఇక బిజెపి అయితే ఖాతా కూడా తెరవలేదు. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం ఉందనగా చంద్రబాబు బీజేపీ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడీ మోసం చేశారని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.అంతే కాకుండా అదే సమయంలో మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దేశవ్యాప్తంగా ప్రచారం కూడా చేయడం జరిగింది. కానీ సీన్ రివర్స్ అయ్యింది. మళ్లీ మోడీ అధికారంలోకి రావడం, ఇటు రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అవడం మనకందరికీ తెలిసినదే. ఇటువంటి తరుణంలో మోడీకి దగ్గరవ్వాలని చూసిన చంద్రబాబుకి మొదటిలో చేసిన ప్రయత్నాలు పెద్దగా సఫలం  కాలేదు. కానీ ఇటీవల చంద్రబాబు కి బిజెపి నుండి సానుకూలమైన వాతావరణం క్రియేట్ అయినట్లు ఏపీ రాజకీయాల్లో టాక్. కరోనా వైరస్ విపత్తు విషయంలో ఏపీ ప్రభుత్వం తేలిందని రెండు పార్టీలు భావిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో బిజెపి- టిడిపి పార్టీ నాయకులు కలిసి పని చేయాలని తాజాగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్. ఈ నేపథ్యంలో ఇప్పటికే కరోనా వైరస్ కట్టడి చేయడంలో మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని చంద్రబాబు మీడియా ముందు అభినందిస్తున్నారు. అంతే కాకుండా ఇటీవల మోడీ తో ఫోన్ లో కూడా మాట్లాడటం జరిగింది.

 

దీంతో బిజెపి పార్టీ హైకమాండ్ కూడా టిడిపితో కలిసి పని చేయడానికి రెడీ అయినట్లు సరికొత్త ప్లాన్ తో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీపై పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. కరోనా వైరస్ కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం ముందునుండి వ్యవహరించిన తీరును, అలాగే కరోనా ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకుని జగన్ ఎన్నికలు అంటూ అనుసరించిన విధానాన్ని భారీ ఎత్తున ప్రశ్నించడానికి టిడిపి బిజెపి కలిసి ఆలోచన చేస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్ వినపడుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version