టీడీపీ నేత‌ అమర్ నాథ్ రెడ్డి అరెస్ట్

మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి కుప్పం నియోజ‌క వ‌ర్గం లో పోలీసులు హ‌ల్ చ‌ల్ చేశారు. కుప్పంలో ని టీ డీపీ అధినేత చంద్ర బాబు హోట‌ల్ ఉన్న టీడీపీ సీనియ‌ర్ నేత మాజీ మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి తో పాటు చిత్తుర్ జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు పులివ‌ర్తి నాని ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు తో కుప్పం నియోజ‌క వ‌ర్గంలో యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

హోట‌ల్ చుట్టు వ‌ల‌పురు పోలీసులు మొహ‌రించారు మాజీ మంత్రి అమ‌ర్ నాథ్ రెడ్డి ని పులివ‌ర్తి నాని అరెస్టు చేసి పోలీసు స్టేష‌న్ కు త‌ర‌లించారు. అలాగే మ‌రొ 17 మంది టీడీపీ నేత‌ల ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే సోమ‌వారం రోజు జ‌రిగిన ద‌ర్న కార్య క్ర‌మంలో అమ‌ర్ నాథ్ రెడ్డి పాల్గొని కుప్పం లోని చంద్ర బాబు హోట‌ల్ లోనే ఉన్నాడు. సోమ‌వారం ద‌ర్న చేస్తే మంగ‌ళ వారం రాత్రి ఆరెస్టు చేయ‌డం ఎంటి అని టీడీపీ కార్య‌క‌ర్త లు ప్ర‌శ్నిస్తున్నారు. కుప్పంలో అశాంతి సృష్టించి ఇక్క‌డ జ‌రుగుతున్న మున్సిప‌ల్ ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధించడానికి వైఎస్ఆర్‌సీపీ ఆడుతున్న నాట‌క‌మ‌ని టీడీపీ కార్య క‌ర్త‌లు అంటున్నారు.