ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరే వస్తువుకు ఉండదు. ముఖ్యంగా మహిళలు.. బంగారం కొనడానికి బాగా ఇష్టపడతారు. ఏ చిన్న పండుగ వచ్చినా…. బంగారం కొనేస్తారు మన దేశానికి చెందిన మహిళలు. అయితే… కరోనా మహమ్మారి విజృంభన అప్పటి నుంచి…. మన దేశం లో పసిడి ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే.
మొన్నటి వరకు తగ్గినా… గత నాలుగు రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈరోజు ధరలు తగ్గడం కాస్త ఊరట కలిగించింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గడంతో రూ. 49,100 కు దిగి వచ్చింది.
ఇదిలా ఉంటే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గడంతో రూ. 45,000 కు తగ్గింది. ఇక ఈ రోజు బంగారం ధరలు తగ్గగా… వెండి ధరలు మాత్రం… స్థిరంగా నమోదయ్యాయి. కేజీ వెండి ధర రూ. 69, 100 వద్ద కొనసాగుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.