డబ్బులు తీసుకొని ఓటేయలేదు.. మా డబ్బులు మాకిచ్చేయండి: టీడీపీ నేతల హుకుం

-

గుడిపాల మండలంలోని 205 పోలింగ్ బూత్ లో పిళ్లారికుప్పం, వెప్పాలమానుచేను, పిళ్లారికుప్పం ఆది ఆంధ్రవాడకు సంబంధించి మొత్తం 999 మంది ఓటర్లు ఉన్నారు. అయితే.. 999 ఓట్లకు గాను 852 ఓట్లు మాత్రం పోలయ్యాయి.

ఓటేస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు. కానీ.. మాకు ఓటేయకుండా వైఎస్సార్సీపీకి ఓటేస్తారా? మా డబ్బులు మాకిచ్చేయండి.. అంటూ టీడీపీ నాయకులు తాము ఇచ్చిన డబ్బుల వేటలో పడ్డారు. చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలానికి చెందిన టీడీపీ నాయకులు పోలింగ్ ముగియగానే రికవరీ వేటలో పడ్డారు. ఇంటింటికి వెళ్లి తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తుండటంతో ఓటర్లు వాళ్లకు డబ్బులు తిరిగి ఇచ్చేది లేదని బేషరతుగా చెప్పారట.

గుడిపాల మండలంలోని 205 పోలింగ్ బూత్ లో పిళ్లారికుప్పం, వెప్పాలమానుచేను, పిళ్లారికుప్పం ఆది ఆంధ్రవాడకు సంబంధించి మొత్తం 999 మంది ఓటర్లు ఉన్నారు. అయితే.. 999 ఓట్లకు గాను 852 ఓట్లు మాత్రం పోలయ్యాయి. ఈ ఊళ్లలో ఎక్కువగా బీసీ ఓటర్లు ఉండటం… వైఎస్ జగన్ బీసీల కోసం నవరత్నాల్లో ప్రాధాన్యత ఇవ్వడంతో చాలామంది వైఎస్సార్సీపీకి ఓటేశారు. తాము డబ్బులు ఇచ్చినప్పటికీ అందరూ వైఎస్సార్సీపీకి ఓటేశారన్న అనుమానంతో తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఓటర్లంతా వాళ్లపై తిరగబడటంతో అక్కడి నుంచి బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. టీడీపీ నేతలు ఇలాగే ప్రవర్తిస్తే వచ్చే స్థానిక ఎన్నికల్లోనూ వాళ్లకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు ఆయా గ్రామాల వాసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version