ఎలక్షన్ అయితే అయిపోనీ.. మీ అంతు చూస్తా… మీ బతుకులు ఎంతరా?

-

బిమఠం మండల నాయకుడు మేకల రత్నకుమార్ కొడుకు బాలకృష్ణ ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరాడు. దాన్ని జీర్ణించుకోలేని పుట్టా కొడుకు మహేశ్.. బాలకృష్ణ కు ఫోన్ చేసి ఇష్టమున్నట్టు తిట్టాడు.

మీరెంత.. మీ బతుకులెంత.. మీ నాయన ఎట్లా బతుకుతాడో చూస్తా. తల లేస్తుంది ఎందుకురా. ఎలక్షన్ అయిపోనీ.. మీ అంతు చూస్తా.. అంటూ మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు మహేశ్ వైఎస్సార్సీపీలో చేరిన నేతపై విరుచుకుపడ్డాడు.

మా వద్ద పనులు చేయించుకొని పార్టీ మారుతారా? వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. ఎట్లా బతుకుతారో చూస్తా.. స్థానిక వైఎస్సార్సీపీ నేత బాలకృష్ణ యాదవ్ ను.. పుట్ట కొడుకు మహేశ్ బెదిరించాడు.

బిమఠం మండల నాయకుడు మేకల రత్నకుమార్ కొడుకు బాలకృష్ణ ఇటీవలే వైఎస్సార్సీపీలో చేరాడు. దాన్ని జీర్ణించుకోలేని పుట్టా కొడుకు మహేశ్.. బాలకృష్ణ కు ఫోన్ చేసి ఇష్టమున్నట్టు తిట్టాడు. మహేశ్ ఫోన్ లో బాలకృష్ణను తిట్టిన ఆడియో ప్రస్తుతం వాట్సప్ లో వైరల్ గా మారింది. అధికారం అండతో మహేశ్ ఇలా రెచ్చిపోయి మాట్లాడటాన్ని అక్కడి స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ మారడం అనేది ఎవరి ఇష్టం వారిదని.. పార్టీ మారితే.. నోటికొచ్చినట్టు మాట్లాడుతారా? అని అక్కడి ప్రజలు కూడా మండిపడుతున్నారు. పుట్టకు ఈసారి సరైన బుద్ధి చెప్పాలని.. పుట్టను ఓడిస్తే అప్పుడు వాళ్లు ఎలా రెచ్చిపోతారో చూడాలని స్థానికులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version