15 ఎంపీ స్థానాలు లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న టీ కాంగ్రెస్..

-

స్పష్టమైన మెజార్టీతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అదే జోష్ లో పార్లమెంట్ ఎన్నికలకు కూడా వెళ్లబోతోంది.. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది.. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను పార్లమెంటు ఎన్నికల్లో కూడా తీసుకురావాలని.. కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే ముఖ్య నేతలతో సమావేశమైన కాంగ్రెస్ అధిష్టానం.. పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిల బలాబలాలు, కుల సమీకరణలు, క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి వంటి వాటిపై చర్చించారు..ఈ క్రమంలోనే కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్చార్జి సైతం అధిష్టానం నియమించింది..

ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్..

తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది.. ఇదే విషయం గత ఎన్నికల్లో స్పష్టమైంది.. అదే ఊపులో 15 ఎంపీ స్థానాలను కచ్చితంగా గెలిచి తీరాలనే టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది.. బలమైన నేతలను రంగంలోకి దింపాలని అధిష్టానం భావిస్తుంది.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిర్వహించిన వార్ రూమ్ స్టాటజీనే పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ అనుసరించాలని.. అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుని కథనరంగంలోకి దూకాలని కాంగ్రెస్ భావిస్తోంది.. అందుకోసం పార్టీ కోసం కొందరు నేతలు త్యాగాలు చేయాల్సి వస్తుందని.. టికెట్ రాకపోయినా.. దానికి ప్రత్యామ్నాయంగా మరో పదవి ఇస్తామని ఇప్పటికే నేతలకు అధిష్టానం సంకేతాలు పంపిందట.. గత ఎన్నికల్లో కేవలం మూడు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు.. ఇప్పుడు వారంతా అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయడంతో.. ఆ స్థానాల్లో బలమైన నేతలను రంగంలోకి దింపాలని.. 15 ఎంపీ స్థానాలు గెలవడం లక్ష్యంగా అందరూ పనిచేయాలని కాంగ్రెస్ హై కమాండ్ నేతలకు సూచించిందట..టిఆర్ఎస్, బిజెపి అభ్యర్థులకు చెక్ పెట్టేలా వ్యూహరచన చేస్తుంది.. అధికార పార్టీ హోదాలో పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్న కాంగ్రెస్.. పక్క పార్టీలో నా సంతృప్తి నేతలకు సైతం గాళం వేసేలా చాప కింద నీరులా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుందని తెలంగాణ కాంగ్రెస్ లో టాక్ నడుస్తోంది.. ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో ఎక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో.. ఆయా ప్రాంతాలలో ఉన్న బలమైన నేతలని పార్టీలోకి లాక్కోవాలని చూస్తుంది.. విపక్షాలకు చెక్ పెట్టేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version