సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా ఉన్న ఆ ఎంపీ పార్టీ మారబోతున్నారా..??

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆ బిజెపి ఎంపీ అత్యంత సన్నిహితుడు.. సొంత పార్టీలో ఆ సిట్టింగ్ ఎంపీ పై అసంతృప్తి పెరిగిపోతూ ఉండడంతో.. ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది.. బీజేపీ లోనే మరోసారి టికెట్ తీసుకోవాలని ఆ ఎంపీ ప్రయత్నాలు చేస్తుండగా.. ఎమ్మెల్యేలు మాత్రం అడ్డుకుంటున్నారు.. ఇంతకీ ఆ సిట్టింగ్ ఎంపి ఎవరో మీరే చుడండి..

ఆదిలాబాద్ బిజెపి ఎంపీ సోయం బాబురావు.. ప్రస్తుతం ఈ పేరు ఆదిలాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.. గత పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసి గెలుపొందిన బాపురావు ఇప్పుడు ఆ పార్టీ నేతలతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారట.. గత అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రెండో స్థానానికి పరిమితమైన బాపూరావు.. ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీలో ప్రచారం జరుగుతుంది.. సిట్టింగ్ ఎంపీగా ఉన్న తనకు కచ్చితంగా టికెట్ వస్తుందని అయన భావిస్తుండగా.. అదిలాబాద్ జిల్లాలో బిజెపి తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం ఆయన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట.. పార్టీ కోసం పనిచేసిన నేతలకు కాకుండా.. వేరే వారికి కాంట్రాక్ట్ పనులు అప్పగించారని బాపురావ్ మీద సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు.. ఈ క్రమంలో అదిలాబాద్ జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉంటే.. నాలుగు నియోజకవర్గాల్లో బిజెపి ఎమ్మెల్యేలు గెలుపొందారు.. వీరందరూ బాపూరావు కి టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి సైతం ఫిర్యాదు చేశారట..

ఇటీవల బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సాల్, ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారట.. ఆ మీటింగ్ కు హాజరైన ముఖ్య నేతలందరితో సునీల్ వన్ టూ వన్ మాట్లాడారు.. లోక్సభ అభ్యర్థిగా ఎవరైతే సరిపోతుందంటూ ఆయన ఆరా తీశారట.. అయితే వారందరూ బాపురావ్ కు వ్యతిరేకంగానే మాట్లాడారని.. ఆయనకు టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని సునీల్ కు చెప్పారట.. దీంతో కొత్త అభ్యర్థి కోసం బిజెపి అన్వేషిస్తుందని పార్టీలో ప్రచారం జరుగుతుంది.. ఈ క్రమంలో కొత్త పేర్లు స్క్రీన్ మీదకు వస్తున్నాయి.. బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబూరావుతోపాటు, రమేష్ రాథోడ్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి..

బిజెపి నుంచి టికెట్ రాకపోతే బాపూరావు కాంగ్రెస్ పార్టీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని బిజెపి నేతలే చెబుతున్నారు.. సీఎం రేవంత్ రెడ్డికి బాపూరావు సన్నిహితులని.. ఇప్పటికే రేవంత్ రెడ్డి తో బాపూరావు టచ్ లో ఉన్నారని పార్టీలో చర్చ నడుస్తుంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version