బ్రేకింగ్; తెలంగాణాలోప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెంపు…!

-

తెలంగాణాలో మెడికల్ కాలేజీల సంఖ్యను మరో నాలుగుకి పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా హరీష్ రావు ఈ కీలక ప్రకటన చేసారు. అదే విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం 12 వందల కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల కోసం అంతర్జాతీయ కంపెనీలు వస్తున్నాయని, దీనితో తెలంగాణా ఖ్యాతి పెరుగుతుందని హరీష్ రావు అన్నారు.

హైదరాబాద్ రావడానికి అంతర్జాతీయ ఐటి దిగ్గజాలు పోటీ పడుతున్నాయని అన్నారు హరీష్ రావు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాలికలు రూపొందించింది అన్నారు మంత్రి. కళ్యాణ లక్ష్మి కార్యక్రమానికి 1,350 కోట్ల రూపాయల నిధులను కేటాయించినట్టు చెప్పారు. ఎంబీసి కార్పోరేషన్ కి 500 కోట్లను కేటాయిస్తున్నట్టు మంత్రి వివరించారు. బీసీ సంక్షేమం కోసం 4,356 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్టు చెప్పారు.

పంచాయితి రాజ్ గ్రామీణాభివృద్ధిభివ్రుద్దికి 23,005 కోట్లు, మున్సిపల్ శాఖకు 14,809 కోట్లు కేటాయించామని చెప్పారు. ఐటి ఉత్పత్తులు 37 వేల కోట్లకు పెరిగాయని, హైదరాబాద్ అభివృద్దికి బడ్జెట్ లో ప్రత్యేక౦గా 10 వేల కోట్లు కేటాయించామని అన్నారు. రెండో దశ మెట్రో కి ప్రణాలికలు సిద్దం చేసామని మంత్రి అన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ కోసం 2,650 కోట్లను, పాఠశాల విద్యకు 10,421 కోట్లను కేటాయిస్తున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news