ఈ ఆర్ధిక ఏడాది నుంచి 57 ఏళ్ళకే వృద్దాప్య పించన్ ని అందిస్తామని తెలంగాణా ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణా రాష్ట్ర బడ్జెట్ ని శాసన సభలో హరీష్ రావు ప్రవేశ పెట్టారు. పెన్షన్ల లబ్దిదారుల సంఖ్య 39 లక్షల, 41 వేల 976 గా ఉందని హరీష్ రావు అన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం 40 వేల కోట్ల రూపాయలను కేటాయించామని హరీష్ రావు అన్నారు.
రైతు బంధు పథకానికి 14 వేల కోట్ల కేటాయించామని… ఈ ఏడాది రెండు వేల కోట్లు పెంచామని హరీష్ రావు పేర్కొన్నారు.మైక్రో ఇరిగేషన్ కు 600 కోట్లు కేటాయించామని హరీష్ రావు పేర్కొన్నారు. తుంపర, బిందు సేద్యానికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. నీటి పారుదల రంగానికి బడ్జెట్ లో అధిక భాగం నిధులు కేటాయిస్తున్నట్టు హరీష్ చెప్పారు. వెనుకబడిన వర్గాల కోసం కృషి చేస్తామని హరీష్ వివరించారు.
ఎస్సీల ప్రగతి నిధి కోసం 16,534 కోట్లు కేటాయిస్తున్నామని అన్నారు. ఎస్టీల ప్రగతి కోసం రూ, 9,771 కోట్లు కేటాయిస్తున్నామని హరీష్ రావు వివరించారు. ఈ బడ్జెట్ లో ఎస్సీలు, మైనార్టీల కోసం భారీగా నిధులు కేటాయించారు. రాష్ట్ర ఆదాయం తగ్గినా సరే వెనుకబడిన వర్గాల కోసం భారీగా నిధులు ఇస్తున్నామని, వారి అభివృద్ధి కోసం కృషి చేస్తామని హరీష్ రావు ఈ సందర్భంగా ప్రకటించారు.