తెలంగాణ మంత్రివర్గ విస్తరణ వాయిదా మీద వాయిదా పడుతుంది.. పిసిసి చీఫ్ నియామకం తరువాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని ఏఐసీసీ పెద్దలు సంకేతాలు ఇచ్చారు.. కానీ ఇప్పటివరకు దానిపైన స్పష్టమైన ప్రకటన రాలేదు.. దీంతో సీనియర్ ఎమ్మెల్యేలందరూ నిరాశలో ఉన్నారు.. ప్రస్తుతం తెలంగాణ క్యాబినెట్లో 12 మంది మాత్రమే మంత్రులు ఉన్నారు.. మరో ఆరుగురికి అవకాశం ఉంది.. అధిష్టానం పెద్దల ఆశీస్సులతో తమ కూడా మంత్రి పదవి దక్కుతుందంటూ కొందరు ఎమ్మెల్యేలు గంపెడు ఆశలు పెట్టుకుని ఉన్నారు..
సీనియార్టీ పరంగా తమకే ప్రాధాన్యత లభిస్తుందని కొందరు ఎమ్మెల్యేలు భావిస్తుంటే.. ఏఐసిసి పెద్దల ఆశీస్సులు ఉన్నాయి.. తమకి మంత్రి పదవి ఖాయం అనే భావనలో మరికొందరు సీనియర్లు ఉన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం క్యాబినెట్ విస్తరణలో తమ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేలా పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతుంది.. ప్రతిపక్ష నేతల విమర్శలను తిప్పికొట్టడంలో ఇప్పుడున్న మంత్రులు ఫెయిల్ అయ్యారనే భావనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారట.. దీంతో మంచి వాగ్దాటి కలిగిన వారికి మంత్రి పదవులు ఇస్టే పార్టీ వాయిస్ బలంగా జనాల్లోకి వెళుతుందనే ఆలోచనలో రేవంత్ ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు..
మరోపక్క మంత్రివర్గ విస్తరణలో తన వర్గం వారికి ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే ఏఐసీసీ పెద్దలను కోరారట.. తాను పిసిసి చీఫ్ గా ఉన్న సమయంలో.. తనకు సహకరించని వారిని క్యాబినెట్ లోకి తీసుకుంటే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి చెప్పడంతో.. నేతల ఎంపికలో జాప్యం జరుగుతోందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి..ఎప్పుడు క్యాబినెట్ విస్తరణ జరిగినా.. ఎమ్మెల్సీ కోదండరాం తో పాటు.. మరో ఇద్దరు కొత్త ఎమ్మెల్యేలకు మంత్రి యోగం దక్కబోతుందని తెలుస్తుంది.. మొత్తంగా తెలంగాణ క్యాబినెట్ విస్తరణ డైలి సీరియల్ ని తలపిస్తోంది..