మళ్లీ తెలంగాణ తెరపైకి పసుపు బోర్డు ఉద్యమం పేరు కనిపిస్తోంది. నినాదం కనిపిస్తోంది. ఎంపీ అరవింద్ ఏమయ్యారు అని కవితక్క ప్రశ్నిస్తున్నారు. ఇదే ఇప్పుడు చర్చకు తావిస్తోంది. అవమాన భారంతో ఓటమి భారంతో మూడేళ్లుగా ఇటుగా రాని కవితక్క మళ్లీ మీడియా ముందుకు వచ్చి నిజామాబాద్ సమస్యపై మాట్లాడుతున్నారు. పసుపు రైతుల సమస్యలపై మాట్లాడుతున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ అటు బీజేపీ కానీ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ రైతుల యోగ క్షేమాలపై ప్రేమ ఉంటే పసుపు కు కనీస మద్దతు ధర అయినా ఆశాజనకంగా ఉండే విధంగా చూడాలని సంబంధిత పోరాట వర్గాలు కోరుతున్నాయి.
తాజా ట్విస్ట్ ఏంటంటే ఎంపీ అరవింద్ పై తెలంగాణ రాష్ట్ర సమితి పోరాటంను ఉద్ధృతం చేయాలని యోచిస్తోంది. ఆయన్ను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని కవితక్క పిలుపునిస్తున్నారు కూడా ! దీంతో అరవింద్ అప్రమత్తం అయ్యారు అని తెలుస్తోంది. మరోవైపు ఆయన వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయరని కూడా తెలుస్తోంది. ఈ సారి ఆయన ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారని ఓ ప్రాథమిక సమాచారం అందిస్తున్న వివరం.ఇక కవితక్క కూడా బాగా యాక్టివ్ కానున్నారు. పల్లె పల్లెకూ పోయి, తమ కారు పార్టీ కార్యకర్తల జోరు పెంచి, కార్యకలాపాలు విస్తృతం అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఓ విధంగా స్టార్ క్యాంపైనర్ గా ఆమె మారనున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా తమ అస్త్రసస్త్రాలనూ రెడీ చేస్తోంది. ఈటల రాజేందర్ ను బాగానే ప్రోత్సహిస్తోంది. బండి సంజయ్ కన్నా ఈటల అయితేనే తెలంగాణ ఇంటి పార్టీని అడ్డుకోవడం కానీ ఆ పార్టీ ఆగడాలను నిలువరించడం కానీ చేయగలరు అని భావిస్తోంది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో మళ్లీ మళ్లీ ప్రజా ఉద్యమాలతో పాపులర్ అయ్యేందుకు బీజేపీ యోచిస్తోంది. గతంలో ఇదే సూత్రంతో టీఆర్ఎస్సోళ్లు సక్సెస్ కొట్టిన్రని అంటోంది.