బీఆర్​ఎస్​లో తొలి వికెట్​ పడినట్లేనా! కాంగ్రెస్​లోకి ఆ ఎమ్మెల్యే?

-

భారతీయ రాష్ట్ర సమితి నుంచి ఓ ఎమ్మెల్యే చేజారినట్లిగానే పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిని కలవడం ఒక ఎత్తయితే.. ఏకంగా బీఆర్​ఎస్​ అధినేత నిర్వహించిన వేశానికి డుమ్మ కొట్టడంతో భద్రాచలం ఎమ్మెల్యే చేజారినట్లుగానే ప్రచారం జరుగుతోంది.

భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ప్రస్తుత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కాంగ్రెస్ పార్టీ నుంచి భద్రాచలం టికెట్​ ఆశించి భంగపడ్డారు. చివరి నిమిషంలో బీఆర్​ఎస్​లో చేరి ఎమ్మెల్యే టికెట్​ పొంది గెలుపొందారు. కానీ, మొదటి నుంచీ బీఆర్​ఎస్​కు దూరంగా ఉంటూనే వస్తున్నారు. పొంగులేటి సైతం తెల్లం వెంకట్రావు తన వెంటే ఉన్నట్లు సంకేతాలు ఇస్తూ వస్తున్నారు.
రెండు రోజుల క్రితం తెల్లం వెంకట్రావు కుటుంబ సభ్యులతోపాటు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిని కలిశారు. ఆ సమయంలో పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కూడా ఉన్నారు.

ప్రస్తుతం లోక్​సభ ఎన్నికల హడావుడి నడుస్తోంది. బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ పార్లమెంట్​ నియోజకవర్గాల వారీగా రివ్యూ సమావేశాలు నిర్వహిస్తారు. సోమవారం ఖమ్మం, మహబూబాబాద్​ పార్లమెంట్​ స్థానాలు రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ రెండు నియోజకవర్గాలకు బీఆర్​ఎస్​ తరఫున ఉన్న ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఆయన రివ్యూ మీటింగ్​ హాజరుకాకపోవడం, ఇటీవలనే ముఖ్యమంత్రిని సైతం కలవడంతో కారు దిగుతున్నట్లు పార్టీ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ, పార్టీ మారితే సభ్యత్వం రద్దయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అనధికారికంగా కాంగ్రెస్​తో కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news