స్పిరిట్ ఆఫ్ గామి…శంకర్ మహదేవన్ వాయిస్ తో గూస్ బంప్స్

-

విద్యాధర్‌ దర్శకత్వంలో మాస్‌ కా దాస్‌ విశ్వక్‌సేన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం గామి.ఈ చిత్రంలో చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుంది. అభినయ ,సమద్‌ మరియు హారిక ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.గత ఏడాది వేసవిలో విడుదల కావాల్సిన గామి చిత్రం వాయిదా పడుతూ ఎట్టకేలకు మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది.

ఇదిలా ఉంటే….లేటెస్ట్ గా ఈ చిత్రం నుండి శివమ్..స్పిరిట్ ఆఫ్ గామి పేరుతో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఈ సాంగ్ ను శివ క్షేత్రం అయిన శ్రీశైలంలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమారన్ సంగీతం అందించగా, దిగ్గజ గాయకుడు శంకర్ మహదేవన్ పాటని పాడారు. శంకర్ మహదేవన్ గాత్రం, బరువైన సాహిత్యంతో శివమ్ సాంగ్ తో గూస్ బంప్స్ వస్తున్నాయి.శివమ్ సాంగ్ లో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే పరిస్థితిలో హీరో విశ్వక్ సేన్ చేసే ప్రయత్నాలు ఏంటనేవి చూపించారు.

Read more RELATED
Recommended to you

Latest news