టీడీపీలో ఓ ఎంపీ విషయం ఇంకా చర్చగానే సాగుతోంది. ఆయన తన వైఖరిని మార్చుకోకపోవడంతో పార్టీకి తిప్పలు తప్పడం లేదని అంటున్నారు పార్టీ సీనియర్లు. తాజాగా మరోసారి ఆయన వివాదాస్పద కామెంట్లు చేయడంతో పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరిగా తయారైందని చెబుతున్నారు. విషయంలోకి వెళ్తే.. గత ఏడాది ఎన్నికల్లో టీడీపీకి ముగ్గురు ఎంపీలు లభించారు. వీరిలో ఆది నుంచి కూడా వివాదాస్ప దంగా ఉన్న నాయకుడు విజయవాడ ఎంపీ, కేశినేని నాని. 2014లో తొలిసారి విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించిన ఆయన ఆదిలోనే దూకుడు చూపించారు.
తన ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీ చేయడంతో విజయవాడ ఆర్టీవో ఆఫీస్‌లో హల్ చల్ చేశా రు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. తర్వాత నేరుగా వెళ్లి డీటీసీకి సారి చెప్పివచ్చారు. ఆ వెం టనే తన ట్రావెల్స్ వ్యాపారానికి తెరదించారు. ఇక, రెండోసారి విజయం సాధించిన తర్వాత పార్టీలో తన కు ప్రాధా న్యం దక్కడం లేదనే ఆరోపణలతో పార్టీ నేతలనే టార్గెట్ చేసి రోజుకో రకంగా ట్వీట్ చేయడం ప్రారంభించా రు.
మరీ ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమా, చంద్రబాబు తనయుడు లోకేష్‌లను కూడా కేశినేని టార్గెట్ చేయడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో ఇక, ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగింది. అయితే, కొన్ని రోజులకు చంద్రబాబు మధ్యవర్తిత్వం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే, ఇటీవ ల కాలంలో కొంత మౌనంగానే ఉన్న కేశినేని.. ఇప్పుడు మళ్లీ రెచ్చిపోవడం ప్రారంభించారు. తాజాగా ఆయ న జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోట్ చేస్తూ.. టీడీపీకి వ్యతిరేకంగా చేసిన ట్వీట్ రాజకీయ వర్గా ల్లో, ముఖ్యంగా టీడీపీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. “రాష్ట్రంలో టీడీపీ ఓడిపోవడానికి, వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్చేశారేంట“ని ముఖ్యమంత్రి జగన్‌ని ప్రశ్నిస్తూ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు.
వివిధ ఆరోపణలతో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేశినేని నాని ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్ టీడీపీలో దుమారం రేపింది. కేశినేని వ్యాఖ్యలను బట్టి.. ఏబీ టీడీపీకి ఫేవర్ చేశారని, చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించారనే విషయం వెల్లడవుతోందని ఇది పార్టీకి చేటు చేసే కార్యక్రమమేనని పార్టీ నేతలు చెవులు కొరుక్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఎంపీ ఇంకా మారకపోతే.. ఎలా? అని ప్రశ్నిస్తున్నారు.