దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి కేసీఆర్.. దూసుకెళ్తున్నారు. దేశంలో పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులతో పాటు కీలక రాజకీయ నాయకులతో సీఎం కేసీఆర్ వరుసగా సమావేశం అవుతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రె తో పాటు శరద్ పవర్ తో డైరెక్ట్ గా సమావేశం అయ్యారు. అలాగే తమిళనాడు సీఎం స్థాలిన్ తో పాటు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఫోన్ ద్వారా చర్చలు జరుపుతున్నారు. తాజా గా మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసేందుకు కేసీఆర్ పయనం అవుతున్నారని సమాచారం.
కాసేపట్లో సీఎం కేసీఆర్ ఢిల్లీకి ప్రత్యేక విమానం లో బయలు దేరనున్నారని తెలుస్తోంది. అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ లేకుండా.. బీజేపీని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలతో సమావేశం అవుతానని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగానే వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగ కేజ్రీవాల్ కూడా గత కొద్ది రోజుల నుంచి బీజేపీ తో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శనాస్త్రలు సందిస్తున్నారు. దీంతో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు పై చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
అలాగే కేసీఆర్.. ఢీల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కూడా చేసుకోనున్నాడని తెలుస్తోంది. అందు కోసమే.. ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్ వెళ్తున్నారని అంటున్నారు.