పాడి కౌశిక్ రెడ్డిను పోటీ నుంచి తప్పించడం వెనుక ప్లాన్ ఇదే.. ఆ వ్యక్తి కోసమేనా?

-

తెలంగాణ రాష్ట్రమంతా ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందా? అని వెయిట్ చూస్తుంది. రోజురోజుకూ హుజురాబాద్ పాలిటిక్స్ మరింత హీటెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ తరఫున బరిలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎత్తుల మీద ఎత్తులు వేస్తున్నది. ఈ క్రమంలోనే నియోజకవర్గంలో యువనేతగా గుర్తింపు పొందిన పాడి కౌశిక్ రెడ్డిని గులాబీ గూటికి చేర్చుకున్నది. ఆ తర్వాత అతడికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు. అయితే, ఇలా ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వెనక గులాబీ పార్టీ వ్యూహమున్నట్లు రాజకీయ వర్గాలతో పాటు ఆ పార్టీ వర్గాల్లోనూ చర్చ జరుగుతున్నది.

Kaushik Reddy Padi | పాడి కౌశిక్ రెడ్డి

కొద్ది రోజుల కిందట కౌశిక్ రెడ్డి మండల స్థాయి నాయకుడితో మాట్లాడిన ఆడియో రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరలవడంతో పాటు అంతటా చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో తనకు టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. ఇక అప్పటికే కౌశిక్ గులాబీ తీర్థం తీసుకోబోతున్నట్లు వార్తలు రావడంతో పాటు కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. ఈ నేపథ్యంలో అతడికి టీఆర్ఎస్ టికెట్ ఇస్తే నెగెటివ్ అయిపోతామని గులాబీ అధిష్టానం ఆలోచినలో పడినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడైన కేసీఆర్ వ్యూహం మార్చి ఆయన్ను హుజురాబాద్ బరి నుంచి తప్పించినట్లు సమాచారం. అయితే, బీసీ సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఈటలను కౌంటర్ అటాక్ చేయొచ్చని, గెల్లు శ్రీనివాస్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. పైగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ స్థానికత కూడా హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలమే. కాగా అది పార్టీకి కలిసొస్తుందని భావిస్తున్నారట టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మొత్తంగా టీఆర్ఎస్ జెండా హుజురాబాద్‌లో ఎగురవేసేందుకు ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version