హైదరాబాద్‌లో రియల్టర్ కిడ్నాప్, హత్య.. స్వామీజీ హస్తం?

-

హైదరాబాద్: నగరంలో రియల్టర్ కిడ్నాప్, హత్య కలకలం రేగింది. నెల్లూరు జిల్లా కావలికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి విజయ్ భాస్కర్ కూకట్‌పల్లిలో ఓ హాస్టల్‌లో ఉన్నారు. గత నెల 20న విజయ్ భాస్కర్ అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్ భాస్కర్ ఉన్న హాస్టల్ సీసీ కెమెరాలను పరిశీలించాలరు. దీంతో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. విజయ్ భాస్కర్‌ను ఇంటి నుంచి కిడ్నాప్ చేసి చంపినట్లు నిర్ధారణ అయింది. మృతదేహం శ్రీశైలం హైవే పక్కన లభ్యమైంది.

ఈ హత్య వెనుక బెంగళూరుకు చెందిన స్వామీజీ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్వామీజీకి విదేశాల నుంచి ఫండ్స్ వస్తాయి. ఈ ఫండ్స్‌ను విజయ్ భాస్కర్ వాడుకున్నట్లు సమాచారం. ఈ వివాదంలో విజయ్ భాస్కర్.. స్వామీజీని కించపరుస్తూ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ భాస్కర్‌ను స్వామీజీ అనుచరులు చంపి ఉంటారని పోలీసుల అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్ భాస్కర్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version