గ్రేటర్ ఎన్నికల్లో ఆ రెండు డివిజన్లు ఇప్పుడు సెంట్రాఫ్ ఎట్రాక్షన్‌గా మారాయి. ఫేక్ సర్టిఫికెట్ ఆరోపణలతో… విజయనగర్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఫాతిమాపై చీటింగ్ కేసు నమోదైంది. ఇక ఘాన్సీ బజార్ బీజేపీ అభ్యర్థి రేణు సోనిపైనా తప్పుడు అఫిడవిట్ ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయ్. వీరిద్దరి పై ఎంపీ అసద్ కామెంట్స్ తో ఈ రెండు డివిజన్ల పై గ్రేటర్ ఎన్నికల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.
కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ తమ్ముడి భార్య ఇనాయా ఫాతిమాపై కేసు నమోదు అయ్యింది. తహసిల్దార్ ఇచ్చిన ఫిర్యాదుపై ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. బీసీ -ఈ సర్టిఫికెట్ ను తప్పుడు పత్రాలతో తీసుకుందని ప్రధాన ఆరోపణ. ఫాతిమా ముస్లిం కాదని అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆమె హిందువు అని, రాజకీయం కోసం తండ్రి పేరును మార్చారని విమర్శించారు.
ఈ వివాదంపై స్పందించారు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. ఇయానా ఫాతిమా తండ్రి హిందువు అని, తన తమ్ముడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని చెబుతున్నాడు. ఒకవేళ తప్పుడు డాక్యుమెంట్స్‌తో నామినేషన్ వేస్తే ఎన్నికల కమిషన్ స్క్రూటినిలోనే రిజెక్ట్ చేసేవారని అంటున్నాడు.. కావాలనే ఎంఐఎం తమను ఎన్నికల్లో అడ్డుకోవడానికి ఇలాంటి కేసులు పెట్టిస్తుందంటున్నారు ఫిరోజ్ ఖాన్.
ఘాన్సీ బజార్ బీజేపీ అభ్యర్థి రేణు సోనిపైనా తీవ్ర ఆరోపణలు చేశారు అసదుద్దీన్ ఒవైసీ. ఆమె బీసీ కాదని, తప్పుడు కుల ధృవీకరణ పత్రాలతో నామినేషన్ వేశారని ఆరోపించారు. రేణు సోనీకి ముగ్గురు పిల్లలుంటే.. ఇద్దరే అని తప్పుడు అఫిడవిట్ ఇచ్చారన్నారు. ఓవైసీ ఆరోపణలపై స్పందించారు రేణు. తనకు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు. ఈ స్థానాన్ని దక్కించుకోవాలనే ఎంఐఎం.. తమను బ్లేమ్ చేస్తోందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సర్టిఫికెట్లు తప్ప.. తమ దగ్గర ఫేక్ సర్టిఫికెట్లు లేవన్నారు.
ఈ ఇద్దరి అభ్యర్థులపైనా విచారణ చేపట్టింది ఈసీ. తప్పుడు దృవీకరణ పత్రాలు సమర్పించారని తేలితే చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.