నేడు కొండ‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మెన్ ఫ‌లితం

-

కృష్ణ జిల్లా లో ని కొండ‌ప‌ల్లి మున్నిప‌ల్ ఎన్నిక‌ల ఉత్కంఠ నేటి కి తెర ప‌డ‌నుంది. చైర్మెన్ ఎన్నిక తుది అంకానికి చేరుకుంది. బుధ వారం రోజున కొండ ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మెన్ ప‌ద‌వి కి ఎన్నిక‌లు జ‌రిగాయి. ఎన్నిక‌ల తుది ఫ‌లితాన్ని బుధ వారమే హై కోర్టు కు ఈ ఎన్నిక‌ల‌ రిట‌ర్నింగ్ అధికారి అప్ప జేప్పాడు. ఈ రోజు టీడీపీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ అఫిసియో ఓటు పై హై కోర్టు తుది నిర్ణ‌యం తీసుకుంటుంది.

దీని త‌ర్వాత ఫ‌లితం వెల‌వ‌డ‌నుంది. బుధ వారం చైర్మెన్ ప‌ద‌వి కి జ‌రిగిన ఎన్నిక లో ప్ర‌తిప‌క్ష‌ టీడీపీ కౌన్సిల‌ర్లు చెన్ని బోయిన చిట్టి బాబు కు మ‌ద్ద‌త్తు తెలిపారు. అలాగే అధికార వైసీపీ కౌన్సిల‌ర్లు జోగి రాము కు మ‌ద్ద‌త్తు తెలిపారు. అలాగే కొండ ప‌ల్లి లోని ఎక్స్ అఫిసియో స‌భ్య‌లు టీడీపీ ఎంపీ కేశినేని నాని తో పాటు వైసీపీ ఎమ్మెల్యే వసంత బుధ‌వార మే ఓటు హ‌క్కు ను వినియోగించు కున్నారు. కాగ హై కోర్టు ఆదేశంతో బుధ వారం కొండ ప‌ల్లి మున్సిప‌ల్ చైర్మెన్ ఎన్నిల‌ను నిర్వ‌హించారు. కానీ ఫ‌లితాల‌ను మాత్రం ప్ర‌క‌టించ వ‌ద్ద‌ని హై కోర్టు ఎన్నిక‌ల అధికారుల‌ను ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news