ఎమ్మెల్యే vs అధికారులు..మద్యవర్తిత్వానికి మంత్రివర్యులు

-

ఒకరు పవర్‌లో ఉంటే.. ఇంకొకరి చేతిలో అధికారం ఉంది. సత్తా నీదా నాదా అన్నట్టు తలపడుతున్నారు ఒకరికొకరు. చూసుకుందాం రా అని సవాళ్లు విసురుకోవడంలోనూ వెనకాడటం లేదు. ఎక్కడో గిరిజన ప్రాంతాల్లో మొదలైన ఈ వివాదం.. అధికారపార్టీ టీఆర్‌ఎస్‌లో హాట్‌ టాపిక్‌గా మారి ఇప్పుడు హైదరాబాద్‌ చేరింది. గత ఎన్నికల్లో ఇదే అంశం కీలకంగా మారి ఐదు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కి గట్టి షాక్ ఇచ్చింది.

భద్రాద్రికొత్తగూడెం జిల్లా అంతా గిరిజన ప్రాంతం. ఇక్కడ ఐదు నియోజకవర్గాల్లో నాలుగు గిరిజనులకే రిజర్వ్ అయ్యాయి. ఇక్కడి గెలిచిన ఎమ్మెల్యేలకు.. ఈ ప్రాంతంలో పనిచేసే అటవీ అధికారులు, సిబ్బందికి ఎప్పుడూ తగువే. పోడు వ్యవసాయంపై గిరిజనులకు ఎమ్మెల్యేలు అండగా ఉంటే.. చట్ట ప్రకారం అలాంటి వాటిని అనుమతించం అని చెప్తారు ఫారెస్ట్‌ అధికారులు. ఇదే అంశం ఎన్నికల్లో ప్రధాన ప్రచార అస్త్రం కావడంతో ఈ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్‌ ఖాతాలో పడ్డాయి. కానీ.. మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. కాకపోతే పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామన్న హామీ తీసుకునే టీఆర్‌ఎస్‌లో చేరారని ప్రచారం జరిగింది.

ఎమ్మెల్యేలు పార్టీ మారారు కానీ.. ఇక్కడి పరిస్థితులు మారలేదన్నది గిరిజనులు చెప్పే మాట. పోడు మాటెత్తితే చాలు అటవీ అధికారులు కేసులు పెడుతున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో గిరిజనులకు ఎమ్మెల్యేపై ఆగ్రహం తన్నుకొస్తోందట. గిరిజనుల ఆగ్రహం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తనదైన శైలిలో అటవీ అధికారులపై కన్నెర్ర చేశారు. అటవీ అధికారులు వస్తే నిర్భందించాలని గిరిజనులకు పిలుపిచ్చారాయన. ఫారెస్ట్‌ ఆఫీసర్లు మాత్రం వెనక్కి తగ్గడం లేదట.

అయితే రేగా కాంతారావు ఈ ప్రకటన ఇచ్చి ఇవ్వగానే ఫారెస్టు అదికారులు కూడ అదే స్థాయిలో స్పందించారు కూడ. దూకుడు మీద ఉన్నారు. ప్రభుత్వం తమకిచ్చిన టార్గెట్ ను మాత్రమే చేస్తున్నామని అంటున్నారు. రేగాకాంతారావు పారెస్టు అదికారుల పై ఆగ్రహానికి స్పందించారు. … ఏమాత్రం దీనిపై ఆగకుండానే ఫారెస్టు అధికారులు అటవీ శాఖ మంత్రి ఇంద్ర కిరణ్ రెడ్డికి, రాష్ర్ట కన్వర్వేటర్ అధికారి శోభకు పిర్యాదుచేశారు. రేగా ఇచ్చిన స్టేట్ మెంట్ ఎంతగా వివాదస్పదం అయ్యిందో అంతే స్పీడ్ గా మంత్రికి అధికారికి పిర్యాదు చేశారంట. ఇంతటితో ఆగవద్దని సిఎం ను సైతం కలిసి పిర్యాదు చేయాలని అనుకుంటున్నారంట.

అయితే మంత్రి ఇరు వర్గాలను సమన్వయ పరచడానిక మద్యవర్థిత్వం చేస్తానని హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మరి ఇంతలా ఆవేశానికి లోనైన రేగా కాంతారావు మంత్రి చెప్పినట్లుగా వింటారా.. ఇది అసలు పరిష్కారం అయ్యే సమస్యేనా.. ఇప్పటికే రెండు సార్లు రేగా కాంతారావు ఫారెస్టు అధికారులపై ఫైర్ అయిన సమస్య పరిష్కారం అవుతుందా.. మంత్రి ఇంద్ర కిరణ్ రెడ్డి చెబితే రేగా వినే పరిస్థితిలో ఉన్నాడా.. లేక సిఎం జోక్యం చేసుకోక తప్పదా అని చర్చలు సాగుతున్నాయంట. మరోవైపున ఫారెస్టు అధికారులు కూడ అమీ తుమీ తేల్చుకోవడానికి సిద్దం అవుతున్నారంట. రేగా వర్సెస్ పారెస్టు అదికారుల వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందా అని గిరిజిన నియోజకవర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version