ప్రజా గోస… కారుకు సెగ!

-

తెలంగాణలో గులాబీ పార్టీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో అనూహ్యంగా బలోపేతం అవుతూ వస్తున్న కమలం పార్టీ…తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. తమకు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా…టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ మరింత దూకుడుగా ముందుకెళుతుంది…ఓ వైపు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలని ఎండగడుతూనే…మరోవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో నియోజకవర్గాల వారీగా బలపడే దిశగా కమలదళం పనిచేస్తుంది.

అటు బలహీనంగా ఉన్న స్థానాల్లో పుంజుకోవడమే లక్ష్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ ల్లో బలంగా ఉన్న నాయకులని లాగే పనిలో ఉన్నారు. ఇలా తెలంగాణలో దూకుడుగా వెళుతున్న బీజేపీ…కారు పార్టీకి ఇంకా చుక్కలు చూపించడమే పనిగా పెట్టుకుని కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజా గోస‌- బీజేపీ భ‌రోసా పేరుతో బండి సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు చేయడానికి సిద్ధమయ్యారు.

బండి సంజయ్…ప్రతీనెల 20 రోజులు ప్రజా సంగ్రామ యాత్ర, పది రోజులపాటు ప్రజా గోస-బీజేపీ భరోసా పేరిట బైక్‌ ర్యాలీలు చేపట్టనున్నారు. తాజాగా సిద్ధిపేటలో ప్రజా గోస కార్యక్రమాన్ని ప్రాంభించారు. ఇక ఇతర నేతలు…తమ తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ ర్యాలీ ద్వారా ప్రజలతో మమేకమవుతూ…వారి సమస్యలని తెలుసుకుని, వాటిపై పోరాటం చేయనున్నారు. అలాగే సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేసే దిశగా ఈ ర్యాలీలు ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే బీజేపీ ఏదొక విధంగా కారు పార్టీకి చుక్కలు చూపిస్తూనే ఉంది..ఇక ఈ ప్రజా గోస కార్యక్రమంతో..కారు పార్టీలో ఇంకా సెగలు రేగనున్నాయని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version