రెపరెపలాడిన గులాబీ జెండా; కెసిఆర్ ఆదేశాలతో సర్వ శక్తులూ ఒడ్డిన మంత్రులు…!

-

ఒక్కటి ఓడిపోయినా సరే మీ పదవి పోతుంది” తెలంగాణా మున్సిపల్ ఎన్నికలకు ముందు తెరాస పార్టీ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన వార్నింగ్ ఇది. తెలంగాణా భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మంత్రులను, ఎమ్మెల్యేలను ఉద్దేశించి కీలకవ్యాఖ్యలు చేసారు. ఈ ఎన్నికల్లో ఎలా అయినా సరే తెరాస విజయం సాధించాలని, వాళ్లకు స్పష్టంగా చెప్పారు.

అభ్యర్ధుల ఎంపిక నుంచి, అసంతృప్తుల బుజ్జగింపు వరకు ప్రతీ ఒక్కటి మీదే బాధ్యత అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు కెసిఆర్. పదవి పోతుంది అనే విషయాన్నీ గట్టిగా చెప్పడంతో మంత్రులు నిద్రాహారాలు మాని తమ తమ జిల్లాల్లో తీవ్రంగా కష్టపడ్డారు. అభ్యర్ధుల ఎంపికను విజయవంతంగా పూర్తి చేసి, రెబల్స్ ఉన్నా సరే వారిని బుజ్జగించి, వినని వాళ్లకు వార్నింగ్ లు ఇచ్చి విపక్షాలకు చుక్కలు చూపించారు.

ఎక్కడా కూడా విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా మంత్రులు సమర్ధవంతంగా రాజకీయం చేసారు. పార్టీకి దూరంగా ఉన్నారు అనుకున్న వాళ్ళ భవిష్యత్తుకి స్పష్టమైన భరోసా ఇచ్చారు. మీకు మేమున్నాం అంటూ కేటిఆర్ కూడా మీతో ఉంటారు అంటూ అందరికి హామీ ఇచ్చి ముందుకి నడిపించారు. తమ వర్గాలకు సీట్లు రాలేదు అని నిరాశలో ఉన్న కార్యకర్తలకు మనం తెరాస, మనలో వర్గాలు ఏంటీ భవిష్యత్తు మీదే అని స్పష్టంగా హామీ ఇచ్చారు.

రెబల్స్ విషయంలో ఎక్కడా కూడా విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా మంత్రులు రాజకీయం చేసారు. కాంగ్రెస్ వాళ్ళను అడ్డం పెట్టుకునే అవకాశం ఉందని భావించి దూకుడుగా రాజకీయం చేసారు. సొంత నిర్ణయాలు స్వేచ్చగా తీసుకోవడంతో పాటు కేటిఆర్ సూచనలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు అభ్యర్ధులతో టచ్ లో ఉంటూ ప్రచారంలో అన్ని విధాలుగా సహకరించారు. ఈ విధంగా తెరాస పార్టీ విజయానికి మంత్రులు తీవ్రంగా కష్టపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news