రాముడ్ని నమ్ముకుని పార్లమెంటు ఎన్నికల బరిలో బండి సంజయ్..

-

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న బండి సంజయ్.. శ్రీరాముని నమ్ముకున్నారు.. అయోధ్యలో బలరాం రాముని విగ్రహావిష్కరణ నేపథ్యంలో కరీంనగర్ లో భారీగా ఫ్లెక్సీలను కటౌట్లను సంజయ్ ఏర్పాటు చేశారట..హిందుత్వ అజెండానే ప్రచార అస్త్రంగా ఆయన దూసుకెళ్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది..

కరీంనగర్లో ప్రతి చోటా భారీగా శ్రీరాముడి కటౌట్లను బండి సంజయ్ ఏర్పాటు చేశారు.. కటౌట్ ను చూడగానే చేతులెత్తి మొక్కేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు..

ప్రతి ఆలయం వద్ద అయోధ్య రామ మందిర ఫోటోలు తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ అలాగే శ్రీరాముని అవతారం, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఫోటోలను కటౌట్ లో ముద్రించారు.. అలాగే బండి సంజయ్ నిర్వహించే ప్రతి సమావేశంలో రామ మందిర అంశాన్ని అయన ప్రస్తావిస్తున్నారట.. హిందువుల ఓట్లను కొల్లగొట్టాలని లక్ష్యంతో బండి సంజయ్ వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ప్రచారం జరుగుతుంది.. ఇదే సమయంలో హిందువుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తుందని విమర్శలను సైతం ఆయన గుప్పిస్తున్నారు..

బండి సంజయ్ పోటీ చేసిన ప్రతి సందర్భంలో హిందుత్వ అజెండాగానే ఆయన ప్రచారాలు నిర్వహిస్తారు.. ఈసారి కూడా రాముని మీద నమ్మకం పెట్టి ఆయన దూకుడు పెంచారని పార్టీ నేతలు చెబుతున్నారు.. కాంగ్రెస్ నేతలు బండి సంజయ్ చేస్తున్న ప్రచారాలపై విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ ఆయన ఎక్కడా తగ్గడం లేదు.. రాముని గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని.. రాముడి పై తమకే హక్కు ఉందంటూ బండి సంజయ్ ఘాటుగా వ్యాఖ్యలు చేయడం కరీంనగర్ బిజెపిలో హాట్ టాపిక్ గా మారింది..

Read more RELATED
Recommended to you

Latest news