బ్లేడుకు డబ్బులు లేకుంటే అడుక్కో.. బండ్లపై దివ్యవాణి ఫైర్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 7’O క్లాక్‌కు బ్లేడ్‌తో పీక కోసుకుంటా అని సంచలనం సృష్టించిన ప్రముఖ కమెడియన్ బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు నారా లోకేష్.. తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో బండ్ల గణేష్ ఆ పార్టీ శ్రేణులకు టార్గెట్‌గా మారారు. లోకేశ్ ఫెయిల్యూర్ అని, అతని వల్ల ఏమి కాదని ట్వీట్‌ల వర్షం కురిపించినా బండ్ల గణేష్‌కు టీడీపీ మహిళా నాయకురాలు దివ్యా వాణి కూడా ధీటుగా బదులిచ్చారు. లోకేష్ సాధించిన ఘనతలను ఇవ్వంటూ పోస్ట్‌లు పెట్టారు. బండ్ల గణేష్ బ్లేడ్ బాగోతం బయటపెట్టడానికే తాను ఈ రకంగా చేస్తున్నానని దివ్య వాణి చెప్పుకొచ్చారు. బ్లేడు కొనుక్కోవడానికి డబ్బులు లేకుంటే అడుక్కోవాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. రాజకీయాలంటే తనకు చాలా ఇష్టమని అయితే చాలా కష్టమని వాటిని వదిలేశానని గణేష్ చెప్పారు. చంద్రబాబు తనయుడిగా పుట్టడం లోకేష్ అదృష్టం అని అన్నారు. రాజకీయాల్లో వారసత్వం ముఖ్యం కాదనీ.. దమ్ము, ధైర్యం తమ తరఫున పోరాడతాడనే నమ్మకం ప్రజల్లో కల్పించడమే రాజకీయ నాయకుడి లక్షణమని అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీ అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీ కాదని లోకేష్‌కు చురకలు అంటించారు. లోకేష్ ప్రవర్తన చూసి చంద్రబాబు నిద్రపోయే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చెప్పారు. చంద్రబాబు నాయుడు కుమారుడిగా తప్ప రాజకీయంగా గా లోకేష్‌కు ఏ అర్హత లేదు.. ఎందుకంటే ఆయన రాజకీయంగా ఫెయిల్యూర్ నాయకుడు అని విమర్శించారు. ఎవరు ఏ విధమైన నా సపోర్ట్ చేయకపోయినా నంబర్ వన్ పొజిషన్ కి వచ్చినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాగా లోకేష్ ఉండాలని అన్నారు. తండ్రి చనిపోయాక ప్రత్యర్థులు అణచివేయాలని చూసినా.. వారిని ఎదురించి తొమ్మిదేళ్లపాటు సుదీర్ఘంగా పోరాడి ఘన విజయం సాధించిన సీఎం వైఎస్ జగన్ లా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

“తనకిష్టమైన నాయకుడు చంద్రబాబని.. ఆయన నలభై ఏళ్ల పోరాటంలో ఎన్నో విజయాలు, ఎన్నో కష్టాలు ఎదుర్కొని ధైర్యంగా పోరాడారు.. లోకేష్ తండ్రి చంద్రబాబు అని చెప్పకునే విధంగా ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మాదిరి లోకేష్ కూడా తండ్రికి పోటీ ఇవ్వాలి. ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి దర్శనం చేసుకుంటే.. మీరు చేసిన ట్వీట్ దిగజారుడుతనానికి అద్ధం పడుతోంది. రాజకీయ నాయకులకి మూడు కావాలి ఒకటి వాళ్ళపై వాళ్ళకు నమ్మకం . రెండు వారి దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు నమ్మి రావడం . మూడు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని వీళ్లు నమ్మటం . నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు ఎవరితో అనుబంధము లేదు కానీ మీరంటే లోకేష్ నాన్నగారు అంటే నాకు గౌరవం. ఆయన తాతగారు అంటే నాకెంతో ప్రేమ అందుకోసమే లోకేష్‌కు ఈ విన్నపం” అని గణేష్ పేర్కొన్నారు.

బ్లేడు కొనుక్కోవడానికి డబ్బులు లేకుంటే అడుక్కో.. : దివ్య వాణి
బండ్ల విమర్శలను తిప్పికొట్టిన దివ్యవాణి.. లోకేష్ బండ్ల గణేష్‌కు మాదిరి నయీంతో కలిసి దందాలు చేయలేదని అన్నారు. 7ఓ క్లాక్‌కు గొంతు కోసుకోవడానికి 5 రూపాయలు లేకపోతే అడుక్కోవచ్చుగా అని ఎద్దేవా చేశారు. స్టాన్‌ఫోర్డ్‌లో చదవడమంటే బడాబాబుల సొమ్ముకు బినామీగా మారి సినిమాలు తీసి ప్రొడ్యూసర్ అనిపించుకోవడం కాదని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ ఎన్నో ఘనతలు సాధించారని చెప్పారు. లోకేష్‌పై ఒక్క అవినీతి కేసు లేదని.. చివరకు చెక్ బౌన్స్ కేసులు, క్రిమినల్ గ్యాంగ్‌లతో సంబంధాలు ఉన్నవారు కూడా ట్వీట్స్ చేస్తున్నారని.. ఇదే కరోనా కాలం అంటే అని వ్యాఖ్యనించారు.

Read more RELATED
Recommended to you

Latest news