వివాదాస్పద ఎంపీ రఘు రామ కృష్ణం రాజు కేసు విషయమై హైకోర్టు కీలకమయిన సూచనలను సీఐడీకి చేసింది. ప్రభుత్వంపై విమర్శానత్మక ధోరణిలో వ్యాఖ్యలు చేయడమే కాక, రాజ ద్రోహం కూడా ఆయనపై నమోదు అయింది. అదొక్కటి మినహాయించి మిగిలిన కేసు విషయమై ఇప్పటికే కొన్ని సూచనలు చేసింది. రఘురామను విచారించే ప్రక్రియను నిమిత్తం ఆయన్ను హైద్రాబాద్లో ఆయన ఇంటిలోనే విచారించి సంబంధించి దృశ్యాలను వీడియో రూపంలో తమకు నివేదించాలని, అదేవిధంగా ఆయన న్యాయవాది సమక్షంలోనే ఈ కేసు విచారణను సాగించాలని ఆదేశించింది. ఇదే కేసులో ఇతర నిందితులయిన టీవీ5, ఏబీఎన్ మాధ్యమాలతో కలిపి ఎంపీని విచారించాలని భావిస్తే 15 రోజులు ముందుగా నోటీసులు ఇవ్వాలని పేర్కొంది. దీంతో ఈ కేసుకు సంబంధించి విచారణను ఎంపీ ఎదుర్కొనక తప్పదని తేలిపోయింది. వాస్తవానికి ఈ కేసు నుంచి తనను మినహాయించాలని, అదేవిధంగా తనపై నమోదయిన అభియోగాలు కొట్టివేయాలని ఆర్ఆర్ఆర్ కోర్టు కుచేసిన విన్నపంను సంబంధిత ధర్మాసనం తోసి పుచ్చింది.
ఈకేసుకు సంబంధించి బుధవారం జరిగిన విచారణలో సీఐడీ తరఫున ప్రభుత్వ న్యాయవాది తనదైన వాదనలు వినిపించి, కేసుకు సంబంధించి దర్యాప్తును సుగమం చేశారు. హైద్రాబాద్ లో ఉన్న దిల్ కుశా గెస్ట్ హౌస్ లో విచారించేందుకు సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది హై కోర్టు. వాస్తవానికి ఓ ప్రయివేటు హోటల్లో విచారణ చేపట్టాలని ఆ విధంగా చేసినా తమకు అభ్యంతరం లేదని ఎంపీ తరఫున న్యాయవాది చెప్పిన మాటలను కోర్టు తోసిపుచ్చింది. దీంతో విచారణ అన్నది ఎక్కడ చేయాలన్నది ఏ విధంగా వైద్య పరమైన జాగ్రత్తలు (పిటిషనర్ హృద్రోగి కావడంతో) తీసుకోవాలన్నది కోర్టు దర్యాప్తు విభాగానికి స్పష్టమయిన ఆదేశాలు ఇచ్చింది.