జ‌గ‌న్‌పై నిరుద్యోగుల ఫైర్‌.. ఆ ప్లాన్ వ‌ర్కౌట్ కావ‌ట్లేదా?

-

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఇటీవ‌ల ఈ ఆర్థిక సంవ‌త్సారానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ జాబ్ క్యాలెండ‌రే ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. ల‌క్ష‌లాది మందిని త‌ప్పుడు లెక్క‌ల‌తో త‌యారుచేసిన క్యాలెండ‌ర్ చూపించి మోసం చేస్తున్నారంటూ నిరుద్యోగులు మండిప‌డుతున్నారు. ఏకంగా ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.

రీసెంట్‌గా ఇదే జాబ్ క్యాలెండర్‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు నిరుద్యోగ యువ‌త‌. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అయితే నిరుద్యోగ యువ‌తీ, యువ‌కులు క‌లిసి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వ‌హించారు. జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న తెలిపారు.

ఇక ఓ నిరుద్యోగి అయితే ఏకంగా సీఎం వైఎస్ జగన్ మోహ‌న్‌రెడ్డి, హోంమంత్రి సుచరితపై క‌ర్నూలులో ఫిర్యాదు చేశాడు. 2019లో జ‌గ‌న్ మాట్లాడుతూ 6,500 పోలీసు ఉద్యోగాల‌కు నియామ‌కాలు చేప‌డుతామ‌ని ప్ర‌క‌టించార‌ని, అలాగే 2020వ సంవ‌త్స‌రంలో 6,300 ఉద్యోగాల‌ను భర్తీ చేస్తామని డిప్యూటీ సీఎం సుచరిత తెలిపార‌ని, కానీ ఇప్పుడేమో జాబ్ క్యాలెండ‌ర్ ద్వారా కేవ‌లం 450 పోస్టులే వేసిన‌ట్టు చెప్పాడు. కాబ‌ట్టి త‌మ‌ను మోసం సీఎం, హోం మినిస్ట‌ర్‌ను కర్నూలు కలెక్టరేట్‌కు పిలిపించి విచార‌ణ జ‌ర‌పాల‌ని బాధితుడు కోరాడు. దీంతో జ‌గ‌న్ పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నిరుద్యోగుల‌ను మోసం చేశాడంటూ మండిప‌డుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version