వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవితకాల అధ్యక్షుడుగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. గుంటూరులో నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా సీఎం జగన్ ను పార్టీ ప్రతినిధులు ఎన్నుకున్నారు. ఇప్పటికే వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవికి విజయమ్మ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో వైసీపీ ప్లీనరీలో పలు సవరణలు చేసి… జగన్ ను వైసీపీ శాశ్వత అధ్యక్షుడుగా ఎన్నుకున్నారు.
అయితే ఏదైనా రాజకీయ పార్టీకి ఎన్నికలు లేకుండా శాశ్వత అధ్యక్షుడుని ఎన్నుకోవచ్చా? లేదా? అనేది వైసీపీకి, ఎన్నికల కమిషన్ ల మధ్య ఉండే అంశం. కానీ దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు…తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు…అసలు పార్టీకి శాశ్వత అధ్యక్షుడుని నియమించడం ఏంటి? ఇదెక్కడి రాజ్యాంగం అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు ఇలాంటి చెత్త ఆలోచనలు ఎవరికైనా వస్తాయా? అంటూ విమర్శించారు.
ఇక్కడ చెప్పాలంటే వైసీపీ అధినేత జగన్…అలాగే వారి పార్టీ అంతర్గత విషయం…వారు సవరణలు చేసుకుని శాశ్వత అధ్యక్షుడుని నియమించుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఎన్నికల సంఘం చూసుకుంటుంది. అయిన ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడే గుర్తింపు పొందిన ఏ రాజకీయ పార్టీ అయిన పనిచేస్తుంది. నిబంధనల ప్రకారమే వైసీపీ కూడా ముందుకెళ్లి ఉంటుంది. అయిన టీడీపీకి శాశ్వత అధ్యక్షుడు చంద్రబాబే కదా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ప్రతి మహానాడులో చంద్రబాబునే కదా అధ్యక్షుడుగా ఎన్నుకుంటున్నారు. రాజకీయాల నుంచి తప్పుకునే వరకు.. ఆయనే అధ్యక్షుడుగా ఉంటారు…ఆయన తప్పుకుంటే లోకేష్ ని అధ్యక్షుడు చేయాలని అనుకుంటారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని చంద్రబాబు నడిపిస్తున్నారు.
కానీ అక్కడ జగన్ సొంతంగా పార్టీ పెట్టుకుని ముందుకెళుతున్నారు…అలాగే ఆయన శాశ్వత అధ్యక్షుడుగానే ఉంటారు…అలాంటప్పుడు బాబుకు వచ్చిన బాధ ఏంటి? అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ముందు బాబు సొంత పార్టీని పైకి లేపే పనులు చూసుకుంటే బెటర్ అని అంటున్నారు.