తెలంగాణలో ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చు అని అన్నారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి తన ఇంట్లో ఏర్పాటు చేసిన లంచ్ కార్యక్రమానికి టీ కాంగ్రెస్ నేతలు, పార్టీ ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్, పలువురు నేతలు హాజరయ్యారు. ఇటీవల పార్టీలో ఎర్ర శేఖర్ చేరికపై కోమటిరెడ్డి అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో టీ కాంగ్రెస్ నేతల సమావేశం పై ఆసక్తి నెలకొంది.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు అని, దానిపై చర్చ చేశామని అన్నారు. అలాగే సిరిసిల్లలో రాహుల్ గాంధీ సభ పైన చర్చ చేశామని తెలిపారు. అన్ని కులాలను కలుపుకుని పోవాలని సూచించారు కోమటిరెడ్డి. పార్టీ ఏ ఒక్కరితోనూ అధికారంలోకి రాదని అన్నారు. పార్లమెంటు సమావేశాల అనంతరం రాష్ట్రమంతా పర్యటిస్తానని తెలిపారు.