టీఆర్ ఎస్ కు హుజూరాబాద్ లో వారే దిక్కా.. కేసీఆర్ వ్యూహం ఏంటి?

-

హుజూరాబాద్ చుట్టూ తెలంగాణ రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఇప్ప‌టికే ఈట‌ల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసిన టీఆర్ ఎస్ ఆయ‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తారా లేక హోల్డ్ లో పెడ‌తారా అనేది అంతుచిక్క‌ట్లేదు. ఇప్ప‌టికే ప‌లువురు నేత‌ల నుంచి ఆయ‌న‌ను స‌స్పెండ్ చేయాలంటూ లేఖ‌లు ప్ర‌గ‌తిభ‌వ‌న్ కు చేరాయి. ఇదిలా ఉంటే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌టించారు. మ‌రి ఆయ‌నే పార్టీ నుంచి తొల‌గిపోతారా లేక పార్టీ స‌స్పెండ్ చేసేదాకా చూస్తారా అనేది ఇక్క‌డ పాయింట్‌.

అయితే ఈ రెండింటిలో ఏది జ‌రిగినా హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం. మ‌రి ఈట‌ల రాజేంద‌ర్ ను ఢీ కొట్టే నాయ‌కులు టీఆర్ ఎస్ కు ఉన్నారా అంటే లేర‌నే చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఈట‌ల అంటే హుజూరాబాద్‌.. హుజూరాబాద్ అంటే ఈట‌ల అన్న‌ట్టు న‌డిచింది. కానీ ఇప్పుడు ఓ కీల‌క నేత అవ‌స‌ర‌మైతే త‌మ కుటుంబం పోటీలో ఉంటుంద‌ని ఇంటిమేష‌న్ ఇస్తున్నాడు. ఆయ‌నెవ‌రో కాదు కెప్టెన్ ల‌క్ష్మీకాంత‌రావు. హుజూరాబాద్ కు ద‌గ్గ‌రి వ్య‌క్తి అలాగే ఆ ప్రాంతంలో ఈయ‌న ఫ్యామిలీకి మంచి ప‌ట్టుంది. దీంతో ఆయ‌న త‌న భార్య స‌రోజినీ దేవిని బ‌రిలో నింపే అవ‌కాశం ఉన్న‌ట్టు ఆయ‌న మీడియాకు ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు. అలాగే ఆయ‌న అన్న రాజేశ్వ‌ర్ రావు మ‌నువ‌డు ప్ర‌ణ‌వ్ బాబును కూడా బ‌రిలో దింపే అవ‌కాశం ఉంది.

అయితే ఇక్క‌డ కెప్టెన్ ఫ్యామిలీకి బీసీ బ్యాంక్ గ్రౌండ్ ఉండ‌టంతో ఆయ‌ననే టీఆర్ ఎస్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుందా.. లేక గ‌తంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డిని టీఆర్ ఎస్ లో చేర్చుకుని టికెట్ ఇస్తుందా అనేది చూడాలి. అయితే కౌశిక్ రెడ్డితో ఓ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ని స‌మ‌చారం. ఇదంతా కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతోంద‌ని ప్ర‌చారం ఉంది. మ‌రి టీఆర్ ఎస్ వీరిలో ఎవ‌రిని ఎంచుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news