apఎక్కడా కూడా లోపాలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సమస్యలు పరిష్కారం విషయంలో పార్టీ అధిష్ఠానం పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో కొన్ని సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి.
ప్రధానంగా కార్యకర్తలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నా సరే గుర్తించే ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియాలో ఉన్న కార్యకర్తలను గుర్తించే ప్రయత్నం పార్టీ అధిష్టానం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా యాక్టివ్గా ఉండే 120 మంది కార్యకర్తలను గుర్తించే అవకాశం ఉందని నియోజకవర్గాల వారీగా వారికి సోషల్ మీడియా బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉండవచ్చన్న అంచనా వేస్తున్నారు.
కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ కొన్ని పోస్టులు అద్భుతంగా రాస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా దగ్గర చేసుకునే విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వాళ్లకు వ్యక్తిగతంగా ఇబ్బందులు వచ్చినా సరే వాళ్ళని అన్ని విధాలుగా ముందుకు నడిపించడానికి పార్టీ అగ్రనేతలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. మరి ఈ విషయంలో కార్యకర్తలకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో చూడాలి.