మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా ఎన్నికల కమీషనర్ పై, టీడీపీ అధినేత చంద్రబాబు పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తిరిగి ఎన్నికల కమీషనర్ గా నియమించడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తిరిగి ఎన్నికల కమీషనర్ గా కొనసాగించాలంటూ ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచంద్ ఇచ్చిన లేఖను తాము గౌరవిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
ఎస్ఈసి వ్యవహారంలో హైకోర్ట్ తీర్పుని కన్సిడర్ చేయమని గవర్నర్ చెప్పారని, కాని ఈ వ్యవహారం సుప్రీం కోర్ట్ లో ఉంది కాబట్టి ఏం జరుగుతుంది అనేది చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ లక్షలు లక్షలు ఇచ్చే లాయర్లను పెట్టుకున్నారని, అసలు ఆ డబ్బులు ఆయనకు ఎవరు ఇస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు నాయుడు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. వెన్నుపోటు పొడవడం అనేది చంద్రబాబు నాయుడు అలవాటుగా చేసుకున్నారని ఆయన మండిపడ్డారు.