పంజాబ్ ల తెలంగాణ వ‌డ్లు ఎందుకు కొన‌దు- మంత్రి నిరంజ‌న్

-

వడ్ల సేకరణ విషయంలో కేంద్ర ప్ర‌భుత్వం ఘోర వైఫల్యం చెందింద‌ని తెలంగాణ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి అన్నారు. తెలంగాణ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం పక్ష‌పాత దోర‌ణి తో ఉంద‌ని అన్నారు. పంజాబ్ రాష్ట్రం లా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించి వ‌డ్ల ను ఎందుకు కొన‌డ లేద‌ని మంత్రి నిరంజ‌న్ ప్ర‌శ్నించారు. యాసంగి వడ్లను బాయిల్డ్ రైస్ కోసం ఇప్పటి వరకు కేంద్రం ప్రోత్సహించింద‌ని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు చేతులెత్తేసిందని విమ‌ర్శించారు.

బీజేపీ వ‌డ్ల కొనుగోలు విష‌యంలో బీజేపీ బెదిరింపులకు పాల్ప‌డుతుంద‌ని అన్నారు. బీజేపీ సొంత‌ ఎంపీ సుబ్రమణ్యస్వామి కూడా స్వయంగా ట్విట్టర్ లో మీడియాలో బీజేపీ ప్రభుత్వ వైఖరి ని వ్య‌తిరేకించార‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ధాన్యం కొనుగోలు చేసిన వెంట‌నే కేంద్రం డబ్బులు సమ‌యానికి ఇవ్వ‌కున్న టీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే రైతులు డ‌బ్బులు ఇస్తుంద‌ని అన్నారు. ఒక్కో సంద‌ర్భంలో కేంద్రం నుంచి ఆరు నెల‌ల వ‌ర‌కు డ‌బ్బు రాల‌ద‌ని అన్నారు. దీనికి వ‌డ్డీ కూడా రాష్ట్రమే భ‌రించింద‌ని గుర్తు చేశారు. దేశంలో బియ్యం నిల్వలు పేరుకుపోయాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటుంటే వరి ధాన్యం పండించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెబుతున్నాడ‌ని.. అన్నారు. వీరు వారి ప్ర‌భుత్వ వైఖరికి విరుద్దంగా బండి సంజ‌య్ మాట్లాడుతున్నాడ‌ని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news