తెలంగానం : హోం మంత్రిని బ‌ర్త‌ర‌ఫ్ చేస్తారా ? నిందితుల‌ను ర‌ఫ్ ఆడిస్తారా ?

-

ఏదయినా ఇష్యూ రైజ్ అయిన‌ప్పుడు ఏపీలో అయితే డైవర్ష‌న్ పాలిటిక్స్ ను న‌డుపుతున్నారు. అదేవిధంగా తెలంగాణ‌లో కూడా చేస్తారా ? జ‌ర‌గ‌రానిది జ‌రిగిన‌ప్పుడు స్పందించాల్సిన వారు ఏమ‌యిపోతున్నారు? ఆహా ! రాత్రికి రాత్రే హోంమంత్రి ఇంట్లో సీసీ టీవీ ఫుటేజ్ ను ట్రేస్ చేసి మానిట‌ర్ చేసి ఫిల్ట‌ర్ చేసి అస్స‌లు ఆయ‌న గారి మ‌న‌వ‌డు అక్క‌డే లేనేలేడ‌ని ఎలా అంటారు? ఏ విధంగా క్లియరెన్స్ ఇస్తారు? అని ప్ర‌శ్నిస్తున్నారు బీజేపీ నాయ‌కులు.

ఇవే ఇప్పుడు ఈ కేసుకు సంబంధిత ద‌ర్యాప్తున‌కు కీల‌కం కానున్నాయి. మైన‌ర్ బాలిక రేప్ విష‌యం ఇంత‌కాలం ఎలా గోప్యంగా ఉంచ‌గ‌లిగారని, ఆపాటి నిఘా లేకుండా ఎలా ఉన్నార‌ని బీజేపీ సోష‌ల్ మీడియా వింగ్  నిల‌దీస్తోంది హైద్రాబాద్ పోలీసును ! చిన్న చ‌లానా ఉంటేనే గంట‌ల త‌ర‌బ‌డి ఆపేస్తారే ! మ‌రి! ఓ కీల‌క కేసులో నిందితుడు అని భావిస్తున్న వ్య‌క్తిని అదుపులోకి తీసుకుని విచారించ‌కుండా ఎలా మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అని చెబుతారు అని ప్ర‌శ్నిస్తోంది కమ్యూనిస్టు పార్టీల సోష‌ల్ మీడియా విభాగం.

త‌ప్పు ఎవ‌రు చేసినా త‌ప్పే అంటారు. కానీ పోలీసులు మాత్రం ఇందుకు డిఫ‌రెంట్ గా ఉన్నారు. త‌ప్పు ఎవ‌రు చేశారో తేల్చ‌కుండానే హోం మినిస్ట‌ర్ గారి మ‌న‌వడికి క్లీన్ చిట్ ఇవ్వ‌డంతో ప్ర‌జా సంఘాలు మండిప‌డుతున్నాయి. అస‌లు అమ్మేషియా ప‌బ్ లో ఏం జ‌రిగింది. ఘ‌ట‌న ఎప్పుడు జ‌రిగింది. ఎప్పుడు వెలుగులోకి వ‌చ్చింది. వీటిపై క‌నీస సమాచారం కానీ అవ‌గాహ‌న కానీ లేకుండా  మాట్లాడ‌డం త‌గ‌ని ప‌ని అని హిత‌వు చెబుతోంది. ఆరోప‌ణ‌లు రాగానే  హోం మినిస్ట‌ర్ త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకుని ఉంటే ఇంకా హుందాగా ఉండేద‌ని, లేదా కేసీఆర్ అయినా స్పందించి ఆయ‌న్ను క్యాబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేస్తే ఇంకా బాగుండేద‌ని ఇవేవీ లేకుండా పోచుపోలు క‌బుర్ల‌తో కాల‌క్షేపం చేయ‌డం అధికార పార్టీకి త‌గ‌ద‌ని వీరంతా అంటున్నారు.

నిన్న రాత్రి ఉన్న‌ట్టుండి క‌ల‌క‌లం రేగింది. తెలంగాణ హోం మినిస్ట‌ర్ మ‌న‌వ‌డు ఓ గ్యాంగ్ రేప్ లో నిందితుడు అన్న వార్త క‌ల‌వ‌రం సృష్టించింది. నేను ఆ రోజు అక్క‌డ లేను.. కావాలంటే సీసీ టీవీ ఫుటేజ్ వెతుక్కోండి అని అంటున్నారాయ‌న‌. ఆయ‌న అన‌గా హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ మ‌న‌వ‌డు ఫ‌రాన్. గ‌తంలో ఇత‌నిపై ప‌లు సంద‌ర్భాల్లో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.ఆ వివాదాలు పోలీసు స్టేష‌న్ల‌లో న‌మోదు అయి ఉన్నాయి కూడా ! ఆశ్చ‌ర్యం ఏంంటంటే ఆయ‌నపై ఆరోప‌ణ‌లు వ‌చ్చిన కొద్ది గంట‌ల్లోనే పోలీసులు అప్ర‌మ‌త్త‌మై అస‌లు విచార‌ణ ఇంకా పూర్తి కాకుండానే ఫ‌రాన్ కు క్లీన్ చిట్ ఇచ్చేశారు.  దీనిపై బీజేపీ మండిప‌డుతోంది. క‌మ్యూనిస్టు పార్టీలూ మండిప‌డుతున్నాయి. ఇప్పుడు దిశ మాదిరిగా నిందితుల‌ను మీరు  ఎన్కౌంట‌ర్ చేయ‌గ‌ల‌రా అని కూడా ప్ర‌శ్నిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version