Good News: పీఎం కిసాన్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు

-

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకానికి కేంద్రం ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి (2022-23) ఆధార్ నమోదు తప్పనిసరి చేసింది. ఈ-కేవైసీ పూర్తి చేయడానికి మొదట్లో 2022 మార్చి 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అయితే అప్పటికీ చాలా మంది రైతులు ఆధార్ నమోదు చేసుకోకపోవడంతో ఆ తేదీని మే 31 వరకు పొడిగించింది. అయినా ఇప్పటికీ చాలా మంది రైతులు ఆధార్ వివరాలు నమోదు చేసుకోలేదు. దీంతో మరోసారి గడువును పొడిగించింది.

రైతులు ఈ-కేవైసీ పూర్తి చేయడానికి జులై 31వ తేదీ వరకు సమయం ఇచ్చింది. కాగా, ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాలో ఒక్కో విడతలో రూ.2 వేలు జమ చేస్తోంది. ఆర్థిక సంవత్సరంలో 3 దఫాలుగా మొత్తం రూ.6 వేలు జమ చేస్తోంది. అయితే పీఎం కిసాన్‌లో రైతులు ఆధార్ వివరాలు క్రింది విధంగా నమోదు చేయాలి.

రైతులు ముందుగా పీఎం కిసాన్ https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌పై క్లిక్ చేయాలి. ఇందులో ఈ-కేవైసీ ట్యాబ్‌ను క్లిక్ చేసి ఆధార్ కార్డు నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేస్తే.. ఓటీపీ వస్తుంది. నాలుగు అంకెల ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. దీంతో మీ ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version