అంజూ యాదవ్‌ డ్యూటీ సరిగ్గా చేయడం కూడా తప్పేనా వపన్‌ తీరును ప్రశ్నిస్తున్న యాదవ వర్గం

-

శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజూ యాదవ్ తన డ్యూటీని కరెక్టుగా చేయడం కూడా నేరమేనా…. ఇది ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట.జనసేనకు చెందిన ఓ కార్యకర్తపై చేయి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.సీఐ వ్యవహారం బాగోలేదంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ స్వయంగా వచ్చి తిరుపతి జిల్లా ఎస్పీకి సీఐ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. కార్యకర్తలపై చేయి చేసుకోవడం తగదని ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆయన ఎస్పీని కోరారు.ఈ కేసులో పవన్‌ వ్యవహారం ఇప్పుడు కాస్త చర్చనీయాంశంగా మారింది.అయితే అంతమంది ఉండగా కేవలం ఒక్కరిని మాత్రమే చెంపదెబ్బ ఎందుకు కొట్టారు అనేది పవన్‌ ఎందుకు ఆలోచించడం లేదని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.

అసలేం జరిగిందంటే. . . . .శ్రీకాళహస్తిలో సీఎంకి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ ఉండగా …అది కూడా రావణుడి మాదిరిగా పది తలలతో కూడిన దిష్టిబొమ్మను తగులబెడుతూ తలమీద కాళ్ళు వేసి తొక్కుతున్న కార్యకర్తలను చెదరగొట్టేందుకు అంజూ యాదవ్ ప్రయత్నించారు.ఈ తరుణంలో జనసేన కార్యకర్తలు నియంత్రణ కోల్పోయి పోలీసుల మీదకే దాడి చేసే పరిస్థితి నెలకొంది. ఇక వేరేమార్గం లేక పరిస్థితి అదుపు చేసే క్రమంలో ఆమె ఒక చెంపదెబ్బ కొట్టారు. లాఠీఛార్జ్ చేయాల్సిన ఉద్రిక్తత ఉన్నా….. కాస్త సామరస్యంగా పరిస్థితి అదుపు చేసే క్రమంలో ఆమె ఒక చెంప దెబ్బ కొట్టారు. ఒక బీసీ మహిళా పోలీస్ ఇలా తమ మీద అధికారం చూపడాన్ని సహించలేని పవన్ కళ్యాణ్ ఇలా ఆమె మీద రాజకీయ దాడి చేస్తున్నారని యాదవ వర్గాలు గుర్రుమంటున్నాయి . యాదవ సామాజిక వర్గానికి చెందిన అంజూ యాదవ్‌కు పవన్‌ కళ్యాణ్‌కు మధ్య ఆస్థి తగాదాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు.

అంజూ యాదవ్ డ్యూటీలో ఎంత క్రమశిక్షణలో ఉంటారో తప్పు చేసినవాళ్ల విషయంలో అంతే కఠినంగా ఉంటారని ఆ ప్రాంతంలో పేరుంది. ఏడాది క్రితం ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె పవిత్ర ఓ ధర్నాలో పాల్గొనగా ఆమెను సైతం ఇలాగే దండించి శాంతి భద్రతలు కాపాడారు . తెలుగుదేశం కార్యకర్తలు అయినా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఏమాత్రం సహించరు అంజూ యాదవ్.అయితే ఇలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అనే పేరున్న అంజూ యాదవ్ కేవలం బీసీ మహిళ అనే కారణంతో చిన్న చూపు చూస్తూ అవమానించడాన్ని ఆ వర్గం ప్రజలు అంగీకరించడం లేదు. తమ ఆడబిడ్డ ఎదుగుదలను సహించలేని పవన్ కళ్యాణ్ ఇలా ఆమెను టార్గెట్ చేస్తున్నారని యాదవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మహిళలు స్ఫూర్తిమంతంగా ఉండాలి అని చెప్పే పవన్‌.. ఇలా వ్యవహరించడం పట్ల విమర్శలు ఎదురవుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు తాము సరైన సమయంలో బుద్ధి చెబుతామని యాదవ వర్గం అంటున్నారు

Read more RELATED
Recommended to you

Exit mobile version