అమరావతిలో వైసీపీ డ్యామేజ్ కంట్రోల్..ఇళ్ల పట్టాలతో స్కెచ్.!

-

వైసీపీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పేరుకు మూడు గాని ప్రధానంగా విశాఖ రాజధాని అనేది వైసీపీ చెప్పేది. ఈ క్రమంలో టి‌డి‌పి హయాంలో ఏర్పాటైన అమరావతిని దెబ్బతీయడమే వైసీపీ టార్గెట్ అన్నట్లు అనిపించింది. ఏదేమైనా గాని చివరికి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయింది. ఆ విషయం పక్కన పెడితే..అమరావతిలో రాజకీయంగా వైసీపీకి నెగిటివ్ అయింది. గత ఎన్నికల్లో అమరావతి లో, చుట్టుపక్కల నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది.

ముఖ్యంగా అమరావతిలో ఉన్న తాడికొండ, మంగళగిరి స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు ఆ స్థానాల్లో వైసీపీకి ఫుల్ యాంటీ ఉంది. ఇక దాన్ని తగ్గించేందుకు వైసీపీ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులతో వస్తుంది. ఈ క్రమంలోనే స్థానికేతరులకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కానీ దానికి అమరావతి రైతులు ఒప్పుకోవడం లేదు. గత ప్రభుత్వ హయంలో కట్టించిన ఇళ్లే ఇంకా పేదలకు ఇవ్వలేదని, తమకు ఫ్లాటులు కేటాయించలేదని, అయినా తాము రాజధాని కోసమని ఇచ్చిన భూములని ఇళ్ల పట్టాలకు ఎందుకు ఇస్తున్నారని కోర్టుకు వెళ్లారు.

కానీ ఈ అంశంలో ప్రభుత్వ నిర్ణయానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..దీంతో రైతులు సుప్రీంకు వెళ్లారు. హైకోర్టు నిర్ణయంతో అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం రెడీ అయింది. అదేమంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు.

పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం తప్పు లేదని, కానీ వైసీపీ రాజకీయ దురద్దేశంతో పట్టాలు ఇస్తుందని..ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతంలోనే పట్టాలు ఇవ్వవచ్చని, కానీ స్థానికేతర్లని తీసుకొచ్చి అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇచ్చి..ఇక్కడ వారే ఓట్లు నమోదు చేసి..మళ్ళీ తాడికొండ, మంగళగిరిల్లో గెలవాలనేది వైసీపీ చేస్తున్న రాజకీయమని టి‌డి‌పి ఫైర్ అవుతుంది. మొత్తానికి వైసీపీ అదే కాన్సెప్ట్ లో ఉన్నట్లు ఉంది. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version