వైసీపీలో ఆ సీనియర్ సంచలనం..మంత్రిపై పోటీ?

-

ఏపీలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగానే ఉంది..అయితే ఎక్కడకక్కడ పోరుకు చెక్ పెట్టాలని వైసీపీ అధిష్టానం చూస్తూనే ఉంది. నేతలని పిలిచి సర్దుకోవాలని చెబుతుంది. అయినా సరే నేతలు వెనక్కి తగ్గడం లేదు. కొన్ని సీట్లలో ఇప్పటికీ రచ్చ లేపుతున్నారు. సీట్ల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఒకరికొకరు చెక్ పెట్టుకునేందుకు చూస్తున్నారు.

ఇదే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి రామచంద్రాపురం నియోజకవర్గంలో రచ్చ మొదలైంది. ఇక్కడ వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఒక ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్గం..రెండు రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గం..మూడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గం. ఈ ముగ్గురిది రామచంద్రాపురం నియోజకవర్గమే. కానీ కొన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. గతంలో ఇక్కడ టి‌డి‌పి నుంచి తోట త్రిమూర్తులు, కాంగ్రెస్ నుంచి పిల్లి సుభాష్ పోటీ పడేవారు. ఒకోసారి ఒకరు పై చేయి సాధించేవారు. మధ్యలో తోట ప్రజారాజ్యంకు వెళ్ళి..తర్వాత కాంగ్రెస్ లో విలీనం కావడంతో ఆ పార్టీలో పనిచేశారు.

ఇక పిల్లి కాంగ్రెస్ పార్టీని వదిలి..మంత్రి పదవిని వదిలి వైసీపీలోకి వచ్చారు. ఈ క్రమంలో 2012 ఉపఎన్నికలో రామచంద్రాపురం బరిలో తోట కాంగ్రెస్ నుంచి, పిల్లి వైసీపీ నుంచి దిగారు. అప్పుడు తోట గెలిచారు. 2014లో తోట టి‌డి‌పి..పిల్లి వైసీపీ నుంచి పోటీ చేశారు. మళ్ళీ తోట గెలిచారు. 2019లో పిల్లి..రామచంద్రాపురం వదిలేశారు. మండపేట వెళ్ళి పోటీ చేసి ఓడిపోయారు.

ఇటు రామచంద్రాపురంలో వైసీపీ నుంచి చెల్లుబోయిన పోటీ చేసి..తోటపై గెలిచారు. ఇక తోట ఓడిపోయాక టి‌డి‌పిని వదిలి వైసీపీలోకి వచ్చారు. ఆయనకు మండపేట బాధ్యతలు ఇచ్చారు..ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇటు ఓడిన పిల్లికి మొదట ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చిన తర్వాత రాజీనామా చేయించి రాజ్యసభ ఇచ్చారు.

అయితే ఇప్పుడు రామచంద్రాపురంలో చెల్లుబోయిన, మండపేటలో తోట ఉన్నారు. పిల్లి సుభాష్ ఎంపీగా ఉన్నారు. కానీ పిల్లి సుభాష్ వచ్చే ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి తన తనయుడుని నిలబెడతానని అంటున్నారు. దీంతో రచ్చ మొదలైంది. రామచంద్రాపురం సీటు ఎవరికి దక్కుతుందో అర్ధం కాకుండా ఉంది. ఒకరికి దక్కిన మరొకరు సహకరించేలా లేరు. దీనివల్ల వైసీపీకి నష్టం జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version